Knuckle Cracking : చేతి వేళ్లు విరిచినప్పుడు శబ్దాలు ఎందుకు వస్తాయి..? తెలుసా..?

April 14, 2023 12:34 PM

Knuckle Cracking : సాధారణంగా మనం శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం కోసం అప్పటికప్పుడైతే ఏం చేస్తాం..? ఒళ్లు విరవడం, కొంత సేపు లేచి అటు, ఇటు నడవడం లేదా టీ, కాఫీ వంటివి తాగడం తదితర పనులు చేస్తాం. అయితే వీటితోపాటు మరొకటి కూడా ఆ జాబితాలో ఉంది. అదే చేతి వేళ్లు విరవడం. బాగా నొప్పిగా ఉన్నప్పుడు లేదా కంప్యూటర్ కీబోర్డుపై ఎక్కువగా పనిచేసే వారు తమ చేతి వేళ్లను ఎక్కువగా విరుస్తారు. ఇలా విరిచే క్రమంలో టక్‌మనే శబ్దం కూడా వాటి నుంచి వస్తుంది. అయితే ఆ శబ్దం ఎందుకు వస్తుంది..? దాని వల్ల లాభమా, నష్టమా..? తెలుసుకుందాం పదండి.

చేతి వేలి జాయింట్లలో సైనోవియల్ ద్రవం ఒకటి ఉంటుంది. దీంట్లో ఓ రకమైన గ్యాస్ ఎప్పటికప్పుడు నిండిపోతుంది. దీంతో చేతి వేళ్లను విరిచినప్పుడు ఈ గ్యాస్ తొలగించబడి దాని స్థానంలో మనకు శబ్దం వినిపిస్తుంది. అయితే ఇలా చేతి వేళ్లను విరవడం వల్ల మనకు లాభమే కలుగుతుందట. నష్టం కలుగుతుందనుకుంటే అది అపోహే అవుతుందట. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు, కీళ్ల జబ్బులు మాత్రం రావు. పలువురు పరిశోధకులు ఇదే విషయంపై పుల్ మై ఫింగర్ స్టడీ పేరిట ఓ పరిశోధన చేశారు. ఈ నేపథ్యంలో వారు ఒక వ్యక్తి తన చేతి వేళ్లను విరిచినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఓ ఎంఆర్‌ఐ పరికరం ద్వారా పరిశోధనను రికార్డ్ చేశారు. ఈ పరిశోధనకు గ్రెగ్ కౌచక్ అనే శాస్త్రవేత్త నాయకత్వం వహించాడు.

Knuckle Cracking what happens then why the sounds
Knuckle Cracking

వాక్యూమ్‌తో నిండి ఉండే ఓ ప్రత్యేకమైన కేబుల్‌ను పరిశోధనలో పాల్గొన్న వ్యక్తి చేతి వేళ్లకు ఉంచారు. దీన్ని ఎంఆర్‌ఐ పరికరానికి అనుసంధానం చేశారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి చేతి వేళ్లను విరవగానే వాటికి అనుసంధానమైన కేబుల్స్ లాగబడి ఎంఆర్‌ఐ పరికరం వ్యక్తి చేతిని స్కానింగ్ చేసి రికార్డ్ చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా టక్‌మని శబ్దం వినిపించింది. అయితే ఈ ప్రయోగం మాత్రం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇలా చేతి వేళ్లు విరవడం వల్ల ఇంకా ఏమేం లాభాలు ఉన్నాయో, నష్టాలు ఉన్నాయో తెలుసుకోవచ్చని వారు అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment