ఆరోగ్యం

Jeera Water : ప‌ర‌గ‌డుపునే గోరువెచ్చ‌ని జీల‌క‌ర్ర నీటిని తాగితే క‌లిగే అద్భుతమైన‌ ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Jeera Water : జీల‌క‌ర్ర‌ను నిత్యం మ‌నం వంట‌కాల్లో ఎక్కువ‌గా వాడుతుంటాం. దీని వ‌ల్ల ఆయా వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే జీల‌క‌ర్ర మ‌న‌కు ఆ విధంగానే కాదు, ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించే ఔష‌ధంగా కూడా ప‌నిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో అనారోగ్య స‌మస్య‌ల‌ను త‌రిమి కొట్టే ఎన్నో ర‌కాల ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో జీల‌క‌ర్ర‌తో త‌యారు చేసిన నీటిని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగితే దాంతో ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేదం చెబుతోంది. జీల‌క‌ర్ర నీటిని ఎలా త‌యారు చేయాలంటే.. ఒక పాత్ర‌లో ఒక గ్లాస్ నీటిని తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. అందులో జీల‌క‌ర్ర వేసి మ‌రికొంత సేపు మ‌రిగించాలి. అనంత‌రం ఆ నీటిని వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే ఉద‌యాన్నే ప‌ర‌గడుపున తాగేయాలి. దీంతో కింద చెప్పిన లాభాలు క‌లుగుతాయి.

జీల‌క‌ర్ర నీటిని రోజూ తాగ‌డం వ‌ల్ల జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. జీర్ణాశ‌యం శుభ్ర‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అసిడిటీ వంటి స‌మ‌స్య‌లు మాయ‌మ‌వుతాయి. ఆక‌లి స‌రిగ్గా లేని వారు ఈ నీటిని తాగితే ఫ‌లితం ఉంటుంది. క‌డుపులో పురుగులు ఉంటే చ‌నిపోతాయి. జీల‌క‌ర్ర నీటిని తాగితే గ‌ర్భిణీల‌కు పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి. జీల‌క‌ర్ర‌లో ఉండే ఔష‌ధ గుణాలు క్షీర గ్రంథుల‌ను ఉత్తేజం చేస్తాయి. డ‌యాబెటిక్ పేషెంట్ల‌కు జీల‌క‌ర్ర నీరు ప‌వ‌ర్‌ఫుల్ మెడిసిన్ అనే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఈ నీటిని రోజూ తాగితే వారి ర‌క్తంలోని షుగ‌ర్ స్థాయిలు త‌గ్గుతాయి. ఫ‌లితంగా మ‌ధుమేహం అదుపులోకి వ‌స్తుంది. దాని వ‌ల్ల క‌లిగే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి.

Jeera Water

జీల‌క‌ర్ర నీటికి బీపీని అదుపు చేసే గుణం ఉంది. దీని వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. ఫ‌లితంగా గుండె స‌మ‌స్య‌లు రావు. స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ వైర‌ల్‌, యాంటీ బ‌యోటిక్‌, యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ ఫంగ‌ల్ గుణాలు జీల‌క‌ర్ర నీటిలో ఉంటాయి. క‌నుక ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. ప‌లు ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. ప్ర‌ధానంగా ద‌గ్గు, జ‌లుబు వంటి అనారోగ్యాలు త‌గ్గుతాయి. జీల‌క‌ర్ర నీటి వ‌ల్ల మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. మూత్రం ధారాళంగా వ‌స్తుంది. కిడ్నీల‌లో రాళ్లు క‌రుగుతాయి. మూత్ర‌పిండాల్లో ఉండే విష ప‌దార్థాలు బ‌య‌టికి పోతాయి. క‌డుపులో వికారం ఉండ‌డం, త‌ల తిప్ప‌డం, త్రేన్పులు వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు జీల‌క‌ర్ర నీటిని తాగితే ఫ‌లితం క‌నిపిస్తుంది.

క‌డుపులో ఏర్ప‌డే అల్స‌ర్ల‌ను, పుండ్ల‌ను త‌గ్గించ‌డంలో జీల‌క‌ర్ర ఎఫెక్టివ్‌గా ప‌నిచేస్తుంది. రోజూ కొద్దిగా జీల‌క‌ర్ర నీటిని తాగితే చాలు. దీంతో ఆయా స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. జీల‌క‌ర్ర నీటిని తాగితే డ‌యేరియా త‌గ్గుతుంది. రోజంతా శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. ఒత్తిడి పోయి ఉత్సాహంగా ఉంటారు. నిద్ర‌లేమితో బాధ ప‌డే వారు జీల‌క‌ర్ర నీటిని తాగితే మంచిది. ఇందులో ఉండే ఔష‌ధ గుణాలు చ‌క్క‌గా నిద్ర ప‌ట్టేలా చేస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM

28 రోజుల రీచార్జ్ ప్లాన్‌ పేరుతో దోపిడీ.. పార్లమెంట్‌లో రాఘవ్ చద్దా ఫైర్!

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…

Thursday, 12 March 2026, 7:33 PM

తాప్సీ ఫైర్.. స్టార్ల స్టాఫ్‌పై నిర్మాతల ఆరోపణల్లో నిజం లేదు!

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వ‌స్తార‌ని, దీంతో వారికి చేసే ఖ‌ర్చు గ‌ణ‌నీయంగా…

Thursday, 12 March 2026, 4:59 PM

ఐపీఎల్ 2026పై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ శుక్లా.. ఆ వార్తల్లో నిజం లేదు!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…

Thursday, 12 March 2026, 3:06 PM