Jaggery : చెరుకు నుంచి తయారు చేసే బెల్లం అంటే చాలా మందికి ఇష్టమే. దీన్ని వంటల్లో వేస్తుంటారు. దీంతో స్వీట్లు కూడా తయారు చేస్తుంటారు. బెల్లం ఎంతో రుచిగా ఉంటుంది. దీంతో చేసే స్వీట్లను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇక షుగర్ ఉన్నవారు బెల్లాన్ని నిర్భయంగా వాడుకోవచ్చని వైద్య నిపుణులు కూడా సూచిస్తుంటారు. అయితే వాస్తవానికి బెల్లంతో ఒక అద్భుతమైన ఉపయోగం ఉంది. అదేమిటో తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు. ఈ క్రమంలోనే రోజూ రాత్రి భోజనం తరువాత చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లంలో మెగ్నిషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది మనస్సుకు ప్రశాంతతను అందిస్తుంది. దీంతో టెన్షన్, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రోజంతా టెన్షన్లతో గడిపేవారు రాత్రి భోజనం అనంతరం చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకోవాలి. దీంతో ఒక్కసారిగా రిలాక్స్ అవుతారు. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి రాత్రి పూట చక్కగా నిద్రిస్తారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. అలాగే బెల్లంలో ట్రిప్టోఫాన్ అనబడే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది సెరటోనిన్ స్థాయిలను పెంచుతుంది. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. చక్కని మూడ్‌లోకి వస్తారు. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
ఇలా రాత్రి పూట బెల్లం తినడం వల్ల గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలో లేపినా లేవరు. అంత చక్కగా నిద్ర పడుతుంది. ఇంతటి అద్భుతమైన ఉపయోగం ఉంది కనుక బెల్లాన్ని రోజూ తినాలి. అయితే షుగర్ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు దీన్ని తీసుకోవడం ఉత్తమం. ఇక బరువు తగ్గాలనుకునే వారు కూడా బెల్లాన్ని తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా బెల్లాన్ని రాత్రి పూట తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…