మనిషి పుట్టుక, చావు.. అనేవి మనిషి చేతిలో ఉండవు. మనిషి కడుపులో పిండంగా పడ్డ తరువాత అతని భవిష్యత్తు నిర్ణయమవుతుంది. అతను ఏమవ్వాలనుకునేది ముందుగానే నిర్ణయించబడుతుంది. అయితే ఇంత వరకు అందరికీ తెలిసిన విషయమే. కానీ మనిషి చనిపోయిన తరువాత అసలు ఏం జరుగుతుంది.. అతని ఆత్మ ఏం చేస్తుంది.. ఎక్కడికి వెళ్తుంది.. అన్న సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. దీనికి సంబంధించి అనేక కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇందుకు గరుడ పురాణంలో చక్కగా వివరణ కూడా ఉంది. ఆ విషయాలనే ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషి ఆయువు తీరిన వెంటనే యమపాశం వస్తుంది. ఆ పాశం మనిషి ఆత్మను బయటకు తీస్తుంది. మనిషి ఆత్మ ఒక పట్టాన బయటకు రాదు. వచ్చేందుకు మొండికేస్తుంది. అయినా సరే యమపాశానికి తిరుగు ఉండదు. కనుక పాశం ప్రయోగించబడిన వెంటనే ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. అది బొటన వేలి సైజులో ఉంటుంది. ఇక ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చిన వెంటనే యమపురికి వెళ్తుంది. అక్కడ 2 ఘడియల పాటు ఉంటుంది. ఆ తరువాత మళ్లీ శరీరం దగ్గరకు వస్తుంది. అక్కడే తిరుగుతూ ఉంటుంది.
ఆత్మ శరీరం దగ్గరకు వచ్చి అంతా తిరుగుతూ చూస్తుంటుంది. తన మృతదేహాన్ని చూసేందుకు ఎవరు వచ్చారు.. తన గురించి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు.. అన్న విషయాలను ఆత్మ పరిశీలిస్తుంది. అయితే ఆ సమయంలో మనం చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడరాదు. చనిపోయిన వ్యక్తి ఎంతటి పాపాలు చేసినా సరే అతని ఆత్మ అక్కడే ఉంటుంది కనుక ఆ సమయంలో మనం అతని గురించి చెడుగా మాట్లాడరాదు. ఇక మృతదేహాన్ని శాస్త్రోక్తంగా దహనం చేసిన తరువాత 11 రోజుల వరకు ఆత్మ ఆ ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్యే ఉంటుంది. తన గురించి తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు.. ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు.. తనకు చేయాల్సిన కర్మలు ఎవరు ఎలా చేస్తున్నారు.. పిండం ఎలా పెడుతున్నారు.. చనిపోయాక అసలు తనను పట్టించుకుంటున్నారా.. లేదా.. అన్న విషయాలను ఆత్మ పరిశీలిస్తుంది.
11 రోజుల తరువాత పెద్ద కర్మ అనంతరం ఆత్మ మళ్లీ యమపురికి వెళ్తుంది. అక్కడ ఆత్మకు శిక్షలు ఉంటాయి. ఆ తరువాత ఆత్మ మళ్లీ ఇంకో జీవిలోకి ప్రవేశపెట్టబడుతుంది. ఇలాంటి సందర్భంలో తిరిగి అదే ఇంట్లోనే చనిపోయిన ఆ వ్యక్తి మళ్లీ పుట్టేందుకు అవకాశాలు ఉంటాయి. కానీ ఇందుకు నియమాలు కూడా ఉంటాయి. ఇక ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలు మాత్రం ప్రేతాత్మలుగా మారుతాయి. వారికి కర్మ చేసినా సరే వారు ప్రేతాత్మలుగానే చాలా కాలం పాటు ఉంటారు. వారు తమ తప్పు తెలుసుకున్నాక అప్పుడు వారి ఆత్మలను ఇంకో జీవిలోకి పంపిస్తారు. ఇలా గరుడ పురాణంలో ఆత్మల గురించి వివరించబడింది. చనిపోయాక ఆత్మ ఏం చేస్తుంది.. ఎక్కడకు వెళ్తుంది.. అన్న వివరాలు అందులో ఇంకా క్షుణ్ణంగా వివరించబడ్డాయి.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…