Flax Seeds For Heart : ప్రస్తుత తరుణంలో చాలా మంది చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్‌ల బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. పూర్వం రోజుల్లో వయస్సు పైబడ్డాక మాత్రమే గుండె పోటు వచ్చేది. కానీ ఇప్పుడు 20 ఏళ్లు నిండిన వారికి కూడా హార్ట్ ఎటాక్ వస్తోంది. ఉన్నట్లుండి హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిన వారిని మనం చాలానే చూస్తున్నాం. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది.. చిన్న వయస్సులోనే చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు ఎందుకు వస్తున్నాయి.. అన్న విషయాలను సైంటిస్టులు సైతం ఇప్పటికీ తేల్చలేకపోయారు. కానీ హార్ట్ ఎటాక్‌లు అనేవి చాలా వరకు ఒక బలమైన కారణం వల్ల వస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఏంటా కారణం.. అంటే..
గుండె నుంచి మన శరీర అవయవాలకు రక్తం సరఫరా అవుతుందన్న సంగతి తెలిసిందే. అయితే రక్తనాళాలు సహజంగానే సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. దీని వల్ల రక్తం సులభంగా సరఫరా అవుతుంది. ఎలాంటి ఆటంకం ఏర్పడదు. కానీ కొందరిలో రక్తనాళాలు సాగే గుణాన్ని కోల్పోతాయి. గట్టిగా మారుతాయి. దీంతో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండెపై పీడనం, ఒత్తిడి పడతాయి. దీంతో గుండెపై భారం పెరిగిపోతుంది. దీర్ఘకాలికంగా ఇది గుండె కండరాలను లేదా రక్తనాళాలను దెబ్బ తీస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్ వస్తుంది. ఇలా హార్ట్ ఎటాక్‌లు చాలా మందికి వస్తున్నాయి.
కానీ హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసేందుకు ఒక అద్భుతమైన ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుందని సైంటిస్టులు తేల్చారు. అది ఏమిటంటే.. అవిసె గింజలు. అవును.. అవే. వీటి గురించి చాలా మందికి తెలియదు. తెలిసిన వారు కూడా వీటిని తినాలంటే అంతగా ఆసక్తిని చూపించరు. కానీ అవిసె గింజలను రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటే రక్త నాళాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయని తద్వారా రక్త సరఫరాకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడవని, దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా నిరోధించవచ్చని.. సైంటిస్టులు తమ పరిశోధనల్లో తేల్చారు. హార్వార్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు దీనిపై పలు పత్రాలను కూడా ప్రచురించారు. అందువల్ల అవిసె గింజలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే తద్వారా గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు.
ఇక అవిసె గింజలను నేరుగా తినలేని వారు వాటిని కాస్త పెనంపై వేయించి తినవచ్చు. అవసరం అయితే ఈ గింజలను పొడి చేసి వాటిని ఖర్జూరాలు, తేనెతో కలిపి తినవచ్చు. వాటితో లడ్డూలను చేసుకుని రోజుకు ఒకటి తినవచ్చు. లేదా అవిసె గింజల పొడిని రోజుకు ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవచ్చు. దీన్ని నిత్యం మనం తినే కూరల్లో కలిపి వాడుకోవచ్చు. లేదా పళ్ల రసాలు, స్మూతీలు, మిల్క్ షేక్‌లు, సలాడ్స్‌లోనూ కలిపి అవిసె గింజల పొడిని తీసుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా ముందుగానే నివారించవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…