Iodine Foods : థైరాయిడ్ కోసం అయోడిన్ అవ‌స‌రం.. ఎందులో ఎక్కువ‌గా ఉంటుంది..?

August 26, 2023 9:19 PM

Iodine Foods : చాలామంది అనేక రకాల సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో పొరపాటు చేయకూడదు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే అన్ని రకాల పోషకాలు కూడా మనకి అందేట్టు మనం చూసుకోవాలి. కాల్షియం, మినరల్స్ వంటి వాటితోపాటు మనకి అయోడిన్ కూడా అవసరం. అయోడిన్ లోపం లేదా శరీరంలో అయోడిన్ ఎక్కువగా ఉండటం వలన థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి, పనితీరుపై ప్రభావం పడుతుంది.

ఎంత అయోడిన్ అవసరం అనే విషయానికి వస్తే.. మహిళలు, పురుషులు రోజుకి 150 మైక్రోగ్రాముల అయోడిన్ తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే స్త్రీలకి కొంచెం ఎక్కువ ఉండాలి. గర్భిణీలకు అయోడిన్ 220 మైక్రోగ్రాములు ఉండాలి. పాలిచ్చే తల్లులకైతే 290 మైక్రోగ్రాముల అయోడిన్ రోజుకి అవసరం. ఇక అయోడిన్ ని ఎలా పొందొచ్చు అనే విషయానికి వస్తే, అయోడిన్ పాలల్లో ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు పాలలో 56 మైక్రోగ్రాముల అయోడిన్ ఉంటుంది. మూడో ఔన్సుల రొయ్యలలో 35 మైక్రోగ్రాముల అయోడిన్ ఉంటుంది.

Iodine Foods take them daily for many benefits
Iodine Foods

ఉడకబెట్టిన బంగాళాదుంపల్లో 60 మైక్రోగ్రాములు ఉంటుంది. హిమాలయ ఉప్పులో చూసుకున్నట్లయితే, అర గ్రాము హిమాలయన్ ఉప్పులో 250 మైక్రోగ్రాముల అయోడిన్ ఉంటుంది. గుడ్లలో కూడా అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. ఉడికించిన గుడ్లలో 12 మైక్రోగ్రాములు ఉంటుంది. ఒక కప్పు పెరుగులో 154 మైక్రోగ్రాముల అయోడిన్ ఉంటుంది.

మొక్కజొన్నని చూసుకున్నట్లయితే, అర కప్పు మొక్కజొన్నలో 14 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది. ఎడిబుల్ సీ వీడ్ లో అయితే ఐయోడిన్‌ బాగా ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు ఎడిబుల్ సీ వీడ్ లో దాదాపు 2000 మైక్రోగ్రాముల దాకా ఉంటుంది. ఇలా ఈ ఆహార పదార్థాలతో మనం అయోడిన్ ని పొందొచ్చు. అయోడిన్ లోపం లేకుండా చూసుకోవచ్చు. కాబట్టి అయోడిన్ ని వీలైనంతవరకు ఆహార పదార్థాల ద్వారా ఇలా తీసుకోవడం మంచిది. ఒకవేళ అయోడిన్ లోపం కానీ అయోడిన్ ని బాగా ఎక్కువ తీసుకున్నా థైరాయిడ్ హార్మోన్ల పనితీరుపై ప్రభావం పడుతుంది. దాంతో అనేక సమస్యలు వ‌స్తాయి. కాబ‌ట్టి మ‌రీ ఎక్కువ కాకుండా, మ‌రీ త‌క్కువ కాకుండా అయోడిన్ అందేట్లు చూసుకోవాలి. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment