ఆరోగ్యం

Intermittent Fasting : త‌క్కువ టైమ్‌లో ఎక్కువ బ‌రువు త‌గ్గాలా.. ఇలా చేయండి చాలు..!

Intermittent Fasting : మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్యతో బాధ‌ప‌డుతూ ఉంటారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే అధిక బ‌రువు స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే అధిక బ‌రువు వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంది. గుండె జ‌బ్బులు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అధిక బ‌రువే అని చెప్ప‌వ‌చ్చు. క‌నుక అధిక బ‌రువు స‌మ‌స్య నుండి వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌డం చాలా అవ‌స‌రం. మ‌న‌లో చాలా మంది బ‌రువు త‌గ్గ‌డానికి ర‌క‌ర‌కాల ప‌ద్ద‌తులు పాటిస్తూ ఉంటారు. అయితే కొంద‌రు ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికి బ‌రువు త‌గ్గ‌రు.

ఇలాంటి వారు ఇంట‌ర్మీటెంట్ పాస్టింగ్ ప‌ద్ద‌తిని పాటించ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఈ ప‌ద్ద‌తిలో రోజుకు రెండు సార్లు మాత్ర‌మే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ప‌ద్ద‌తిని మ‌న పూర్వీకులు ఎప్పుడో పాటించారు. క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే వారు రోజుకు మూడు సార్లు ఆహారాన్ని తీసుకునే వారు. అదే నీడ‌ప‌ట్టున కూర్చుని ప‌ని చేసే వారు రోజుకు రెండు సార్లు మాత్ర‌మే ఆహారాన్ని తీసుకునే వారు. ఇలా తీసుకోవ‌డం వ‌ల్లనే వారు ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేకుండా ఎంతో కాలం జీవించారు. ఈ ప‌ద్ద‌తినే మ‌నం ఇప్పుడు ఆచ‌రించాలి. ఈ ఇంట‌ర్మీటెంట్ ఫాస్టింగ్ లో రోజుకు రెండు సార్లు ఆహారాన్ని తీసుకుని 16 గంట‌లు ఎటువంటి ఘ‌న ప‌దార్థాల‌ను తీసుకోకుండా ఉండాలి.

Intermittent Fasting

ఉద‌యం 10 గంట‌ల‌కు ఏదైనా ఒక వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి. ఇలా తీసుకున్న గంట త‌రువాత రెండు లేదా మూడు పుల్కాల‌ను కూర‌ల‌తో క‌లిపి తీసుకోవాలి. ఇలా తీసుకున్న త‌రువాత మ‌ర‌లా సాయంత్రం 4 గంట‌ల‌కు ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ ను తీసుకోవాలి. అలాగే 5 గంట‌ల‌కు మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తీసుకోవాలి. త‌రువాత 7 గంట‌ల లోపు వివిధ ర‌కాల పండ్ల‌ను తీసుకోవాలి. మ‌రింత శ‌క్తి కావాల‌నుకునే వారు ప‌చ్చి కొబ్బ‌రిని, నాన‌బెట్టిన ప‌ల్లీల‌ను, డ్రై ఫ్రూట్స్ ను కూడా తీసుకోవ‌చ్చు. సాయంత్రం 7 గంట‌ల లోపు ఈ విధంగా ఆహారాన్ని తీసుకున్న త‌రువాత మ‌ర‌లా ఉద‌యం 11 గంటల వ‌ర‌కు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడ‌దు.

ఈవిధంగా ఇంట‌ర్మీటెంట్ ఫాస్టింగ్ ను పాటించ‌డం వ‌ల్ల రెండు నెల‌ల్లోనే మ‌నం 5 నుండి 10 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ ప‌ద్ద‌తిని పాటించ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఆరోగ్య‌వంతంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఈ ప‌ద్ద‌తిని పాటించ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డంతో పాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా అందుతాయి. అలాగే షుగ‌ర్, థైరాయిడ్, ఆర్థ‌రైటిస్ వంటి స‌మ‌స్య‌లు అదుపులోకి వ‌స్తాయి. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు ఈ ఇంట‌ర్మీటెంట్ ఫాస్టింగ్ ప‌ద్ద‌తిని పాటించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM