శరీర సౌందర్యంలో గోళ్లకు చాలా ప్రాధాన్యత ఉంది. మన చేతిగోళ్ళు మనకున్న వ్యాధులను చెప్పగలవు అనే విషయం మీకు తెలుసా.. అవును ఇది నిజమే… వ్యాధులను నిర్ధారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వైద్యులు కొన్నిసార్లు గోర్లను చూసి వారు ఏ వ్యాధితో బాధపడుతున్నారో ఇట్టే చెప్పగలరు. గోళ్ళ ఆరోగ్యం మనుషుల యొక్క ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని చాలా మంది చెబుతుంటారు.
గోళ్ళ ఆరోగ్యంగా ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నారని, గోళ్లు పెళుసుగా ఉంటే వారు తరచుగా వ్యాధుల బారిన పడుతుంటారని పలు అధ్యయనాలలో నిరూపితమైంది.. అయితే గోళ్ళ పై తెల్ల మచ్చలు, రంగు మారడం వంటి కొన్నిరకాల కారణాలు అనారోగ్య సమస్యలకు దారి తీసేందుకు సంకేతమని నిపుణులు సూచిస్తుంటారు. ఈ విషయం తెలియక చాలా మంది గోళ్ల ఆరోగ్యాన్ని, అందాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.
కొంచెం శ్రద్ద తీసుకుంటే గోళ్లను ఎంతో అందంగా ఉండేలా చేసుకోవచ్చు. గోళ్లు పాలిపోయినట్లుగా ఉంటే రక్తహీనత ఉన్నట్లు, అదేవిధంగా గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటే రక్తం తగినంత ఉందని అర్థం చేసుకోవచ్చు. గోళ్ల ఎదుగుదల తక్కువగా ఉండి పసుపు రంగులో మందంగా ఉంటే మూత్రపిండాల ఆరోగ్యం సరిగ్గా లేదని గుర్తు ఉంచుకోవాలి. అదే గోళ్లపై తెల్లటి మచ్చలు ఉంటే కాల్షియం లోపంగా గుర్తించాలి. సరైన పోషకాహారం తీసుకోకపోతే ఆ ప్రభావం గోళ్లపై పడుతుంది. విటమిన్ బి, సి లోపం వల్ల గోళ్లు చిట్లాటం వంటి సమస్య ఏర్పడుతుంది. అందువలన గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్, విటమిన్ ఎ, బి, ఇ, సి, ఉండే ఆహారాలను పుష్కలంగా తీసుకోవాలి.
గోళ్లను ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. వేడి నీటిలో కొంచెం నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఆ నీళ్లలో స్పాంజ్‌ని తడిపి దానితో గోళ్లను శుభ్రం చేసుకోవాలి. తర్వాత గోళ్లకు మాయిశ్చరైజింగ్ క్రీమ్ లేదా లోషన్ రాయాలి. ఇలా ప్రతి రోజు చేస్తే మీ గోళ్లను అందంగా ఆరోగ్యంగా తయారవుతాయి.
గోళ్లను ఆరోగ్యంగా కాపాడుకోవడానికి మరో అద్భుతమైన చిట్కా ఏమిటంటే. విటమిన్ ఈ క్యాప్సూల్‌ని బ్రేక్ చేసి అందులోని నూనెను గోళ్లపై రాసుకుని మర్ధన చేసుకుంటే గోళ్లు మెత్తగా, ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఇక గోళ్లపై ఎక్కువగా గీతలు పడితే వేడినీటిలో నిమ్మరసం కలిపి అందులో ఒక 20 నిమిషాల పాటు గోళ్లను నానబెట్టుకుని తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…