సినిమా చూస్తున్నంతసేపు అభిమానుల్లో తెలియని ఉత్సాహం.. ప్రతీ సీన్‌కు విజిల్ వేయాలనిపించే ఎలివేషన్స్.. తమ హీరోను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించే సీన్స్.. మహేష్ బాబు అంటే అప్పటివరకు ఒక లవర్ బాయ్‌గానే చాలామందికి తెలుసు. అలాంటి టైమ్‌లో వచ్చింది ఒక్కడు. మహేష్ క్లాస్‌తో పాటు మాస్ కూడా చించేయగలడని నిరూపించింది. గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా భూమిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో భూమికకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఒక్కడు 2003 జనవరి 15న విడుదలైంది.
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలనిజం మహేష్ బాబు హీరోయిజం హైలెట్ గా నిలిచాయి. కబడ్డి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటికి మహేష్ బాబు మురారి సినిమా విడుదల కాలేదు. రాజకుమారుడు సినిమా మాత్రం హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం కథా రచయిత వెల్లడించారు. నిర్మాత ఎంఎస్ రాజు మహేష్ బాబుతో ఓ సినిమా చేసేందుకు వెళ్లినప్పుడు ఒక్కడు కథను కూడా వినిపించారట. మహేష్ ఒక్కడు కథ నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
అయితే అప్పట్లో మహేష్ బాబుకు శాకమూరి రాంబాబు అనే మేనేజర్ ఉండేవారట. గుణశేఖర్ ఒక్కడు సినిమా కోసం మహేష్ బాబును సంప్రదించే సమయంలో మేనేజర్ ఫోన్ తీసేవారు కాదట. లేదంటే బాబు పడుకున్నారు అంటూ ఏదో ఒక రీజన్ చెప్పేవారట. దాంతో మహేష్ బాబు సినిమా చేస్తారా ఆయనకు ఆసక్తి ఉందా లేదా అని మేకర్స్ డైలమాలో పడిపోయారట. తరవాత ఇదే కథను పవన్ కల్యాణ్ లేదా వెంకటేష్ లతో చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేశారట. అలా డైలమాలో ఉన్న సమయంలోనే మహేష్ బాబు ఫోన్ చేసి ఒక్కడు తానే చేస్తానని చెప్పారట.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…