వినోదం

బ్ర‌హ్మానందం చేసిన ప‌నికి ఆ ఊరి వాళ్లంతా షాక్‌.. అలా చూస్తుండిపోయారు..

హాస్యబ్రహ్మ, నవ్వుల రారాజు, కామెడీ కింగ్‌ అని ఇలా ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా తక్కువే. ఏదైనా మీమ్స్ సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిందంటే దాంట్లో బ్రహ్మానందానికి సంబంధించిన కామెడీ ఫేస్ కనిపించవలసిందే. ఆయన కనుబొమ్మ అలా ఎగరేస్తే చాలు ప్రేక్షకుడి పొట్ట చెక్కలయ్యేలా నవ్వవలసిందే. ఒక చిత్రంలో బ్రహ్మానందం నటించారంటే కామెడీ పరంగా ఆ సినిమా సక్సెస్ సాధించాల్సిందే. ప్ర‌స్తుతం బ్ర‌హ్మానందం వ‌య‌సు రిత్యా సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. ఒక‌టి రెండు సినిమాలు మాత్రమే చేస్తూ త‌న కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గ‌డుపుతున్నారు. అంతేకాకుండా  అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తూ తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు బ్రహ్మానందం.

హాస్యనటుడిగా చిత్రపరిశ్రమకు తన ఎనలేని సేవలు అందించి ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని సైతం అందుకున్నారు బ్రహ్మానందం. ఇంత గొప్ప నటుడు ఈ స్థాయికి రావడానికి తన ముందు జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. 1956 ఫిబ్రవరి 1న ఆంధ్రప్రదేశ్, సత్తెనపల్లిలో ఒక పేద కుటుంబమైనా కన్నెగంటి నాగలింగాచారి, లక్ష్మీనరసమ్మ దంపతులకు బ్రహ్మానందం జన్మించారు. సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో ప్రాథమిక విద్యను, భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో MA పూర్తి చేశారు. ఆ తర్వాత అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్‌గా పనిచేశాక నటన మీద మక్కువతో సినీరంగంలోకి అడుగుపెట్టారు.

కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో పాఠాలు బోధిస్తూ అప్పుడ‌ప్పుడూ మిమిక్రీ చేస్తూ విద్యార్థుల‌ను నవ్వించేవారు.  ఓ రోజు అత్తిలి గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మానికి బ్రహ్మానందం హాజ‌ర‌య్యారు. ఆ కార్య‌క్ర‌మంలో మిమిక్రీ చేస్తూ ప్ర‌జ‌ల‌ను కడుపుబ్బ న‌వ్వించారు బ్రహ్మి. ప్ర‌జ‌లందరు న‌వ్వ‌డం చూసి అప్పుడే అక్క‌డ‌కు వ‌చ్చిన ఊరి ప్రెసిడెంట్ అంద‌ర్నీ న‌వ్వ‌కూడ‌దు అంటూ హెచ్చ‌రించారట. ఆయ‌నఒక తెలుగు లెక్చ‌ర‌ర్..  ఆయనను చూసి గౌర‌వం లేకుండా అలా న‌వ్వుతారా అంటూ ప్ర‌శ్నించారట ఆయ‌న‌ను చూసి న‌వ్వితే శిక్ష వేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చారట ఆ ఊరి ప్రెసిడెంట్.  ఇక ఆ త‌ర‌వాత ప్రెసిడెంట్ అక్కడ నుండి వెళ్లిపోయిన కూడా బ్ర‌హ్మానందం జోకులు వేసినా, మిమిక్రీ చేసిన ప్రజలందరూ చూస్తుండిపోయారు త‌ప్ప న‌వ్వేలేదట. ఈ విష‌యాన్ని బ్ర‌హ్మానందం ఒక ఇంట‌ర్వ్యూలో ఆయనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రామాయణ టీజర్ వచ్చేసింది.. రాముడిగా రణబీర్ దివ్యత్వం! రావణుడిగా యశ్ అదిరిపోయే ఎంట్రీ..

దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో రాముడిగా ర‌ణ‌బీర్ క‌పూర్ తొలి…

Thursday, 2 April 2026, 3:04 PM

చిరంజీవి ఇంటి పూజా మందిరంలో అద్భుతం.. హనుమాన్ విగ్రహంపై సూర్య కిరణాలు!

హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా త‌మ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్ర‌హంపై సూర్య కిర‌ణాలు ప‌డ‌డం త‌న…

Thursday, 2 April 2026, 11:37 AM

‘పెద్ది’ రిలీజ్ డేట్‌పై రామ్ చరణ్ క్లారిటీ.. ఏప్రిల్ 30న థియేటర్లలో మెగా మాస్ జాతర!

బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.…

Wednesday, 1 April 2026, 11:20 PM

అమరావతికి నేను వ్యతిరేకం కాదు.. అది దేశంలోనే పెద్ద స్కామ్! చంద్రబాబుపై జగన్ ఫైర్..

అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండ‌డంలో త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని, కానీ రాజ‌ధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్ప‌డుతోంద‌ని, దానికి తాము…

Wednesday, 1 April 2026, 9:09 PM

సల్మాన్ ఖాన్ భద్రతలో లోపం? అభిమానుల మధ్య చిక్కుకున్న ‘భాయ్’.. వీడియో వైరల్!

ప‌బ్లిక్‌లో ఉన్న‌ప్పుడు సెల‌బ్రిటీల‌తో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గంద‌ర‌గోళ…

Wednesday, 1 April 2026, 5:13 PM

‘భూత్ బంగ్లా’ కోసం అక్షయ్ కుమార్ పూజలు.. అత్త డింపుల్‌తో కలిసి మహాకాళ్ దర్శనం!

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియ‌ద‌ర్శ‌న్ దర్శకత్వంలో తెరకెక్కిన…

Wednesday, 1 April 2026, 3:36 PM

రాముడు ఎప్పటికీ ఆదర్శమే.. లాస్ ఏంజెల్స్‌లో రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ సందడి!

శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడ‌ని న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…

Tuesday, 31 March 2026, 10:49 PM

అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని…

Tuesday, 31 March 2026, 8:28 PM