తెలుగువారి గొప్పదనాన్ని అంతర్జాతీయంగా రెప రెపలాడించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. నటుడిగా తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో.. నాయకుడిగా తెలుగు వారి హృదయాల్లో ఆయన వేసిన ముద్ర శాశ్వతం. 295 చిత్రాల్లో ఆయన పోషించని పాత్రంటూ లేదు. ప్రతి పాత్రకు తన నటనతో ప్రాణం పోసిన నట దిగ్గజం ఎన్టీఆర్. ముఖ్యంగా ఎన్టీఆర్ ఏ పాత్ర వేసినా అటు నిర్మాత ఇటు డైరెక్టర్ ఇద్దరు సంతృప్తి చెందేవారు.
ఎన్టీఆర్ విలక్షణమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవారు. ఎన్టీఆర్ సినీ జీవితంలో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రాలలో అడవి రాముడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమా అప్పట్లో ఒక సపరేట్ ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా జయప్రద,జయసుధ నటించి అలరించారు. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. సత్యనారాయణ, సూర్యనారాయణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
1977లో వచ్చిన అడవి రాముడు సినిమా అప్పటివరకు వచ్చిన సినిమాల కన్నా భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాతో కమర్షియల్ సినిమాలు టాలీవుడ్ లో ఆరంభమయ్యాయని చెప్పాలి. అడవి రాముడు సినిమా హీరోయిజాన్ని చూపించే పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమా కథాంశం మొత్తం ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమా తర్వాత జయప్రద, జయసుధలకు కూడా స్టార్ హీరోయిన్స్ గా మంచి గుర్తింపు వచ్చింది. దర్శకుడు రాఘవేంద్రరావు కూడా అడవి రాముడు చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమాలోని ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనే పాట ఇప్పటికి కూడా శ్రోతల్ని ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ కూడా ఈ పాటకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
కానీ ఈ చిత్రంలో స్క్రీన్ పై మాత్రం ఎన్టీఆర్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్టైలిష్ గా కనిపించి అప్పటిలో స్టైల్ ఐకాన్ గా మారారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ వేసుకున్న కాస్ట్యూమ్స్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ వేసుకున్న డ్రెస్సింగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అని చెప్పవచ్చు.ee సినిమాలో ఎన్టీఆర్ సూట్, బూట్ కట్ ప్యాంట్ లతో నటించి అభిమానులను బాగా ఆకర్షించారు. అడవి రాముడు చిత్రం విడుదలైన సమయం నుంచి అప్పటిలో యూత్ మొత్తం ఎన్టీఆర్ డ్రెస్సింగ్ స్టైల్ నే ఫాలో అయ్యేవారు. ఈ సినిమా తరవాత చాలా కాలం పాటు బూట్ కట్ ప్యాంట్ ట్రెండ్ గా కొనసాగింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…