ఆ సినిమా త‌రువాత స్టైల్ స్టార్‌గా మారిన ఎన్‌టీఆర్‌.. అది ఏదంటే..?

October 27, 2022 6:54 PM

తెలుగువారి గొప్ప‌ద‌నాన్ని అంత‌ర్జాతీయంగా రెప రెప‌లాడించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌. న‌టుడిగా తెలుగు ప్రేక్ష‌కుడి గుండెల్లో.. నాయ‌కుడిగా తెలుగు వారి హృద‌యాల్లో ఆయ‌న వేసిన ముద్ర శాశ్వ‌తం. 295 చిత్రాల్లో ఆయ‌న పోషించ‌ని పాత్రంటూ లేదు. ప్ర‌తి పాత్ర‌కు త‌న న‌ట‌న‌తో ప్రాణం పోసిన న‌ట దిగ్గ‌జం ఎన్టీఆర్‌. ముఖ్యంగా ఎన్టీఆర్ ఏ పాత్ర వేసినా అటు నిర్మాత ఇటు డైరెక్టర్ ఇద్దరు సంతృప్తి చెందేవారు.

ఎన్టీఆర్ విలక్షణమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవారు. ఎన్టీఆర్ సినీ జీవితంలో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలు ఉన్నాయి.  ఇక ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రాలలో అడవి రాముడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమా అప్పట్లో ఒక సపరేట్ ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా జయప్రద,జయసుధ నటించి అలరించారు. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.  సత్యనారాయణ, సూర్యనారాయణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

1977లో వచ్చిన అడవి రాముడు సినిమా అప్పటివరకు వచ్చిన సినిమాల కన్నా భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాతో కమర్షియల్ సినిమాలు టాలీవుడ్ లో ఆరంభమయ్యాయని చెప్పాలి. అడవి రాముడు సినిమా హీరోయిజాన్ని చూపించే పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమా కథాంశం మొత్తం ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమా తర్వాత జయప్రద, జయసుధలకు కూడా స్టార్ హీరోయిన్స్ గా మంచి గుర్తింపు వచ్చింది. దర్శకుడు రాఘవేంద్రరావు కూడా అడవి రాముడు చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.  ఈ సినిమాలోని ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనే పాట ఇప్పటికి కూడా శ్రోతల్ని ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ కూడా ఈ పాటకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

కానీ ఈ చిత్రంలో స్క్రీన్ పై మాత్రం ఎన్టీఆర్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్టైలిష్ గా కనిపించి అప్పటిలో స్టైల్ ఐకాన్ గా మారారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ వేసుకున్న కాస్ట్యూమ్స్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  ఎన్టీఆర్ వేసుకున్న డ్రెస్సింగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అని చెప్పవచ్చు.ee సినిమాలో ఎన్టీఆర్ సూట్, బూట్ కట్ ప్యాంట్ లతో నటించి అభిమానులను బాగా ఆకర్షించారు. అడవి రాముడు చిత్రం విడుదలైన సమయం నుంచి అప్పటిలో యూత్ మొత్తం ఎన్టీఆర్ డ్రెస్సింగ్ స్టైల్ నే ఫాలో అయ్యేవారు.  ఈ సినిమా తరవాత చాలా కాలం పాటు బూట్ కట్ ప్యాంట్  ట్రెండ్ గా కొనసాగింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now