ఆరోగ్యం

Honey And Fruits : షుగ‌ర్ ఉన్న‌వాళ్లు తేనె తీసుకోవ‌చ్చా.. పండ్లు తిన‌వ‌చ్చా.. తీసుకుంటే ఏం జ‌రుగుతుంది..?

Honey And Fruits : ప్రస్తుత త‌రుణంలో అధిక శాతం మంది డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు వృద్ధుల‌కు మాత్ర‌మే షుగ‌ర్ స‌మ‌స్య వ‌చ్చేది. కానీ ఇప్పుడు యువ‌త కూడా దీని బారిన ప‌డుతున్నారు. అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వల్లే షుగ‌ర్ వ‌స్తోంది. అధిక శాతం మంది టైప్ 2 డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్నారు. అయితే ఈ వ్యాధి ఉన్న‌వారు ఆహారం విష‌యంలో ముఖ్య‌మైన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండ్లు, తేనె తీసుకునే విష‌యంలో అనేక సందేహాలు వ‌స్తుంటాయి. వాటికి నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిర్భ‌యంగా పండ్ల‌ను తిన‌వ‌చ్చు. పండ్ల‌లో స‌హ‌జ‌సిద్ధ‌మైన చ‌క్కెర‌లు ఉంటాయి. ఇవి ర‌క్తంలో నెమ్మ‌దిగా క‌లుస్తాయి. క‌నుక డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఎలాంటి జంకు లేకుండా పండ్ల‌ను తిన‌వ‌చ్చు. అయితే పండ్ల‌ను మాత్రం అతిగా తిన‌రాదు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక పూట 2 చ‌పాతీల‌ను తింటున్నార‌ని అనుకుందాం. పండ్ల‌ను తిన‌ద‌లిస్తే ఒక చ‌పాతీ చాలు. మిగిలిన చ‌పాతీకి బ‌దులుగా ఏవైనా పండ్ల‌ను తినండి. ఇలా డ‌యాబెటిస్ ఉన్న‌వారు పండ్ల‌ను తిన్నా ఏమీ కాదు. షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు. ఇలా మోతాదులో తినాల్సి ఉంటుంది.

Honey And Fruits

ఇక కొన్ని ర‌కాల పండ్ల‌కు గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ ఎక్కువ‌గా ఉంటుంది. అంటే ఈ పండ్ల‌ను తింటే చ‌క్కెర‌లు త్వ‌ర‌గా ర‌క్తంలో క‌లుస్తాయ‌న్న‌మాట‌. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయి. కొన్ని ర‌కాల పండ్లు మ‌రీ తియ్య‌గా ఉంటాయి. ఇలా పండ్ల‌ను తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ అమాంతంగా పెరుగుతాయి. క‌నుక జీఐ విలువ ఎక్కువ‌గా ఉన్న పండ్ల‌ను అయితే తిన‌రాదు. జీఐ విలువ త‌క్కువ‌గా ఉండే పండ్ల‌ను తింటే మేలు జ‌రుగుతుంది. ఇలా డ‌యాబెటిస్ ఉన్న‌వారు ప‌లు ర‌కాల జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తూ పండ్ల‌ను నిర‌భ్యంత‌రంగా తీసుకోవ‌చ్చు. దీంతో ఎలాంటి ఇబ్బందులు రావు.

ఇక తేనెను కూడా షుగ‌ర్ ఉన్న‌వారు వాడ‌వ‌చ్చు. కానీ రోజు మొత్తంలో తీసుకున్న కార్బొహైడ్రేట్స్ శాతం తగ్గించాలి. అందుకు బ‌దులుగా తేనె తీసుకోవ‌చ్చు. లేదంటే షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగే అవ‌కాశాలు ఉంటాయి. తేనె స‌హ‌జసిద్ధ‌మైన‌దే. కానీ కొంద‌రిలో షుగ‌ర్ లెవ‌ల్స్‌పై ప్రభావం చూపించ‌వ‌చ్చు. క‌నుక తేనెను వాడే ముందు డాక్ట‌ర్‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం. రోజులో తీసుకునే కార్బొహైడ్రేట్ల‌ను కాస్త త‌గ్గించి దానికి బ‌దులుగా తేనెను తీసుకోవ‌చ్చు. దీంతో ఎలాంటి ఇబ్బందులు రావు. ఇలా డ‌యాబెటిస్ ఉన్న‌వారు తేనెను కూడా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ తేనె గురించి భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM