Bhoo Varaha Swamy : ప్రతి ఒక్కరికి జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది. కొందరికి ఈ కోరిక తీరితే కొందరికి మాత్రం సొంత ఇల్లు అనేది కళలాగానే ఉంటుంది. మనం ఇల్లు కట్టుకోవాలంటే ఆర్థిక వనరులు అన్ని ఉప్పటికి వాటికి దైవబలం తేడైతేనే మనం ఇల్లు కట్టుకోగలుగుతాము. మన వెంట దైవబలంఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాము. సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే కళ నెరవేరాలనుకునే వారు భూ వరాహ స్వామి ఆలయాన్ని దర్శించి సంకల్పం చేసుకోవాలి. ఇలా సంకల్పం చేసుకుని తమ సొంతింటి కళ నెరవేర్చుకున్న తిరిగి మొక్కును చెల్లించుకున్న భక్తులు వేలల్లో ఉన్నారు. ఈ భూవరాహ స్వామి క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో మండ్యా జిల్లాలో కె ఆర్ పేట నుండి 18 కిలో మీటర్ల దూరంలో కలహల్లి అనే గ్రామంలో హేమావతి నది ఒడ్డున ఉంటుంది.
ఈ ఆలయానికి రావడానికి బస్సు సౌకర్యం ఉన్నప్పటికి అంతా ఎక్కువగా ఉండదు. సొంత వాహనాల్లో రావడమే మంచిది. ఈ ఆలయం ప్రతిరోజూ తెరిచి ఉంటుంది. ఉదయం 8 గంటల నుండి 2 గంటల వరకు అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి 7 గంటల వరకు ఉంటుంది. అలాగే ఈ ఆలయంలో మధ్యాహ్నం అన్న ప్రసాదం కూడా ఉంటుంది. స్థల పురాణాల్లో శ్రీహరి తన భార్యను తొడ మీద కూర్చోబెట్టుకుని ముత్యాల హారాలు ఇస్తున్నట్టు పురాణాల్లో చెప్పబడింది. ఎవరైతే ఈవిడ దర్శనాన్ని చేసుకుంటారో వారు నిత్య సుమంగళిగా ఉంటారని కూడా చెప్పబడింది. జగత్ పురుషుడైన నారాయణుడు, జగన్ మాత అయిన భూదేవి భూవరాహ రూపంలో కూర్చోని ఉంటారు. ఇక్కడ పూజలు చేయించుకోవాలనుకునే వారు హేమవతి నదిలో స్నానం చేసి పూజలు చేయాలి.
ఇక్కడ ఇటుక పూజ, మట్టి పూజ అని రెండు రకాలు ఉంటాయి.స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారు, అలాగే ఇల్లు కట్టడం మొదలై మధ్యలో ఆగిపోయిన వారు ఇటుక పూజ చేయాలి. ఇక్కడ రెండు ఇటుకులతో పూజ చేయిస్తారు. ఒక ఇటుకను అక్కడే ఉంచి ఇంకో ఇటుకను ఇంటి తీసుకువచ్చి పూజ గదిలో ఉంచాలి. ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఈ ఇటుకను ఇంటి ద్వారం వద్ద ఉంచి పూజ చేసి ఇల్లు కట్టుకోవాలి. అలాగే మట్టి పూజ. భూమి కొనుకోవాలన్నా, పొలం కొనుక్కోవాలన్నా, భూమ ఎక్కువ ధరకు అమ్ముడు పోవాలన్నా ఈ మట్టి పూజను చేయాలి. ఇలా పూజలు చయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయగలుగుతాము. భూ తగాదాలతో బాధపడే వారు, కోర్టు కేసుల్లో భూమి ఉన్న వారు ఇలా భూ వరాహ స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…