మనలో చాలా మంది కష్టపడి పనిచేసినప్పటికి వేలకు వేలు సంపాదించినప్పటికి డబ్బు మాత్రం చేతిలో అస్సలు నిలవదు. ఏదో ఒకరూపంలో సంపాదించిన డబ్బు అంతా ఖర్చైపోతూ ఉంటుంది. కొన్ని సార్లు మనం సంపాదించిన దాని కంటే ఎక్కువ ఖర్చైపోతూ ఉంటుంది. ఇలా అధిక ఖర్చులతో బాధపడే వారు, చేతిలో డబ్బు నిలబడని వారు ఇంట్లో డబ్బులు ఉంచే చోట ఈ వస్తువులను ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తీరతాయని పండితులు చెబుతున్నారు. ఐశ్వర్యం కలగాలంటే వాస్తు శాస్త్ర ప్రకారం బీరువాలో కొన్ని వస్తువులు ఉంచాలని వారు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇంట్లో సరైన దిశలో బీరువాను ఉంచాలి. బీరువాను ఇంట్లో నైరుతి దిశలో ఉంచాలి. అలాగే దీనిలో పడమర నైరుతి, దక్షిణ నైరుతి అని రెండు రకాలు ఉంటాయి. మనం దక్షిణ నైరుతిలో బీరువాను ఉంచాలి.
బీరువా తలుపులు తెరవగానే అవి ఉత్తరం దిక్కును చూస్తూ ఉంటాయి. ఉత్తర దిక్కులో కుబేరుడు ఉంటాడు. ఉత్తర దిక్కును కుబేర స్థానం అంటారు. బీరువవా తలుపులు ఉత్తర దిక్కున ఉండడం వల్ల కుబేరుడు వచ్చి బీరువాలో నివాసం ఉంటాడు. అలాగే చాలా మంది తెలిసీ తెలియక బీరువాలో ఎర్రటి వస్త్రాన్ని ఉంచుతారు. అసలు బీరువాలో ఎర్రటి వస్త్రాన్ని ఉంచకూడదని పండితులు చెబుతున్నారు. బీరువాలో తెల్లటి వస్త్నాన్ని ఉంచాలి. నవ గ్రహాల్లో శుక్రుడుకి ఇష్టమైన రంగు తెలుపు. శుక్రుడుకి అధిష్టాన దేవత అమ్మవారు. అందుకే బీరువాలో డబ్బు పెట్టే చోట తెల్లటి వస్త్రాన్ని ఉంచాలి. అలాగే బీరువాలో లోపల తలుపుకు కుడి చేతిలో బంగారు నాణాలు వర్షిస్తూ…. వరద ముద్రలో, పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవి చిత్రం ఉంటే చాలా మంచిదని పండితులు తెలియజేస్తున్నారు. అలాగే లక్ష్మీదేవికి వట్టివేలు అంటే చాలా ఇష్టం.
కనుక లక్ష్మీ దేవి విగ్రహానికి అభిషేకం చేసేటప్పుడు వట్టివేలు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. అదే విధంగా విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. కనుక విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. విష్ణుమూర్తికి ఇష్టమైన పచ్చకర్పూరాన్ని, లక్ష్మీ దేవికి ఇష్టమైన వట్టివేరును ఒక వెండిపాత్రలో ఉంచి బీరువాలో ఉంచాలి. ఇలా ఎవరైతే బీరువాలో ఉంచుతారో వారి ఇంట్లో లక్ష్మీ దేవి తాండవం చేస్తుందని డబ్బుకు కొదవ ఉండదని పండితులు తెలియజేస్తున్నారు.ఈ నియమాలను పాటించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఆదాయం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…