Guava Leaves For Hair : పేదవాడి యాపిల్ గా పేరుగాంచిన జామకాయ నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది కదూ. ఇప్పుడంటే జామకాయల్ని కూడా కొనుక్కుని తింటున్నాం కానీ ఇంతకుముందు చాలా ఇళ్లల్లో చెట్లుండేవి. దొంగతనంగా కోసుకుని తిన్న కాయలు రుచి ఎక్కువగా ఉండేవి. ఇలాంటి జ్ణాపకాలు మనకెన్నో. సరే ఇప్పుడు జామకాయల గురించి కాదు కానీ జామ ఆకుల గురించి మాట్లాడుకుందాం. జామ ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. రాలుతున్న జుట్టు నేడు అందరూ ఎదుర్కొంటున్న సమస్య. ఆ సమస్యకు చక్కగా చెక్ పెట్టడానికి జామ ఆకులు కరెక్ట్. అది ఎలాగో తెలుసుకోండి.
జామ ఆకులు సూక్ష్మజీవుల్ని నిరోధిస్తాయి. జామ ఆకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగితే కడుపునొప్పి పోతుంది. అంతేనా అతిసారం, డయేరియా వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి. జామాకుల్ని తినటం వల్ల దంతాలకు ఆరోగ్యంతో పాటు నోటిలోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. నోటిలో ఉండే పొక్కులు పోతాయి. నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తుంది. జామ ఆకులతో టీ చేసుకొని తాగితే చక్కని ఫలితం ఉంటుంది. రక్తంలో చక్కెర శాతం అధికం కాకుండా జామ ఆకులు నియంత్రిస్తాయి.
అంతే కాకుండా జామాకులతో చేసిన టీ తాగటం వల్ల శ్వాసకోస సంబంధమైన సమస్యలు పోతాయి. దగ్గు తగ్గిపోతుంది. జామ ఆకుల్లో విటమిన్- బి పుష్కలంగా ఉంటుంది. విటవిన్ బి2 కణాల నిర్మాణంలో సహాయపడుతుంది. బి3, బి5, బి6 విటమిన్లు చర్మ సౌందర్యానికి మేలు చేస్తాయి. గుప్పెడు జామాకుల్ని లీటరు నీటిలో 20 నిమిషాల పాటు ఉడకబెట్టాలి. ఆ నీరు గోరువెచ్చగా అయిన తర్వాత జుట్టు కుదుళ్ల వరకూ అప్లై చేయాలి. అనంతరం కాసేపు ఆగి తలస్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల జుట్టు రాలిపోవటం లాంటి సమస్యలు తలెత్తవు. దీంతో పాటు జుట్టు కుదుళ్లు దృఢంగా తయారవుతాయి. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇలా జామ ఆకులతో ఎన్నో లాభాలను పొందవచ్చు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…