Cloves Tea : ఉదయం లేవగానే టీ తాగడం అందరికీ అలవాటు. కొంతమందికి టీ తాగకపోతే ఆ రోజంతా ఏదో కోల్పొయినవాళ్లలా ఫీలవుతారు. ఆరోగ్యంపై శ్రద్ద పెరిగి టీలో కూడా చాలా రకాలు వచ్చాయి. లెమన్ టీ, పుదీనా టీ, అల్లం టీ ఇలా. ఈసారి డిఫరెంట్ గా లవంగాల టీ ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. లవంగాలతో చేసిన టీ తాగినట్టయితే జీర్ణక్రియను పెంపొందిస్తుంది. భోజనానికి ముందు ఒక కప్పు లవంగాల టీ తాగటం వలన అజీర్ణం, పొట్టలో కలిగే అసౌకర్యాలు, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కార్మినేటివ్ గుణాలను కలిగి ఉండే లవంగాల టీ అపానవాయువు (గ్యాస్) వంటి సమస్యల నుండి, ఉదర భాగంలో కలిగే నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
కీళ్ళనొప్పులు, కండరాల నొప్పి లేదా చీలమండల కండరాలు దెబ్బ తినటం వలన కలిగే నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు లవంగాలతో చేసిన టీ బాగా పనిచేస్తుంది. లవంగాల టీ తయారు చేసి శుభ్రమైన వస్త్రాన్ని టీలో ముంచి నాన్చండి. ఈ నానిన వస్త్రాన్ని ప్రభావిత భాగంపై 20 నిమిషాల పాటు ఉంచండి. ఇలా రోజూ రెండు నుండి 3 సార్లు చేయటం వలన మంచి ఫలితం మీరే గమనిస్తారు. లవంగంతో చేసిన టీకి కొద్దిగా నాన్- క్లోరిన్ నీటిని కలపండి. ఈ రకం గాఢత తక్కువగా గల టీని యాంటీ ఫంగల్ డౌచ్ (శరీర అవయవాలను శుభ్రం చేసుకోటానికి ఉపయోగించే ద్రవం)గా యోని ప్రాంతంలో కలిగే ఈస్ట్ ఇన్ఫెక్షన్ లను తగ్గించే ద్రవంగా వాడవచ్చు.
నలుపు, ఎరుపు వెంట్రుకలు కలిగి ఉండి జుట్టు అందవిహీనంగా ఉంటే లవంగాలతో చేసిన టీ జుట్టుకు అప్లై చేయండి. దాని వలన ఎరుపు జుట్టును మరింత ప్రకాశవంతగా మార్చి హైలైట్ అయ్యేలా చేస్తుంది. తలస్నానం చేశాక చివరలో లవంగాల టీ తో కడిగి శుభ్రమైన నీటితో మళ్లీ కడగండి. మార్పు గమనించండి. పిక్నిక్ లేదా ట్రిప్ లలో ఒక బాటిల్ లో లవంగాలతో చేసిన టీ మీతో తీసుకెళ్ళండి. మంచి హ్యాండ్ వాష్ గా పని చేస్తుంది. కొద్దిగా ఈ టీని తీసుకొని చేతులకు రాసుకోండి. ఇలా రోజు భోజనానికి ముందు, తరువాత ఈ టీ ని చేయికి రాసుకోవటం ఒక అలవాటుగా చేసుకోండి. యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉండే ఈ టీ చేతులను శుభ్రం చేస్తుంది. కనుక లవంగాల టీని ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవాలి. ఇలా ఈ టీతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…