ఆరోగ్యం

Boiled Egg : కోడిగుడ్డును ఎన్ని నిమిషాలు ఉడికిస్తే మంచిదో తెలుసా..?

Boiled Egg : కోడిగుడ్ల‌ను ఇష్ట‌ప‌డని వారు ఎవ‌రుంటారు చెప్పండి. అవంటే చాలా మందికి ఇష్ట‌మే. కొంద‌రు వాటిని ఉడ‌క‌బెట్టి తింటే ఇంకొంద‌రు ఆమ్లెట్ వేసుకుని, ఇంకా కొంద‌రు కూర‌గా చేసుకుని తింటారు. అయితే ఎవ‌రు ఎలా తిన్నా ఉడ‌క‌బెట్టిన గుడ్ల విష‌యంలో మాత్రం మ‌నం ఓ విష‌యాన్ని గురించి క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే. అదేమిటంటే.. ఒక‌ కోడిగుడ్డు ఉడికేందుకు మ‌హా అయితే ఎంత స‌మ‌యం ప‌డుతుంది..? 10 లేదా 15 నిమిషాలు. అదీ.. మనం పెట్టే మంట‌ను బ‌ట్టి కూడా ఉంటుంది. కానీ అస‌లు గుడ్డును స‌రిగ్గా ఎన్ని నిమిషాల పాటు ఉడికించి తింటే మంచిదో తెలుసా..? ఇదే విష‌యంపై జె. కెంజీ లోపెజ్- ఆల్ట్ అనే ఓ అమెరిక‌న్ చెఫ్ ప్ర‌యోగం చేశారు. ఆయ‌న ఏం చెబుతున్నారంటే..

కోడిగుడ్డు తెల్ల సొన ఉడికేందుకు దాదాపుగా 82 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవ‌స‌రం. అదే దాని లోప‌ల ఉన్న ప‌చ్చ సొన ఉడికేందుకు మాత్రం అంత క‌న్నా త‌క్కువ‌గా అంటే 76 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్ర‌మే అవ‌సరం అవుతుంద‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో గుడ్డును ఉడ‌క‌బెట్టే కొద్దీ ఒక్కో నిమిషానికి అందులో వ‌చ్చే మార్పుల‌ను ఆయ‌న రికార్డ్ చేశారు. గుడ్డును ఉడ‌క‌బెట్టిన‌ప్పుడు 1 నుంచి 3 నిమిషాల‌లో గుడ్డు ఇంకా ప‌చ్చిగానే ఉంటుంది. కానీ ప‌చ్చ సొన విడిపోయి ద్ర‌వంగా మారుతుంది. తెల్ల‌సొన అలాగే జిగురుగా ఉంటుంది.

Boiled Egg

5 నుంచి 7 నిమిషాల్లో గుడ్డు పచ్చ సొన గ‌ట్టిగా మారుతుంది. కానీ తెల్ల‌సొన ఇంకా ద్ర‌వంగానే ఉంటుంది. 9 నుంచి 11 నిమిషాల్లో ప‌చ్చ సొన బాగా ఉడుకుతుంది. తెల్ల‌సొన గ‌ట్టిగా మారుతుంది. జిడ్డుగా ఉంటుంది. 13 నుంచి 15 నిమిషాల్లో గుడ్డు బాగా ఉడుకుతుంది. తెల్ల‌, ప‌చ్చ సొన‌లు రెండూ హార్డ్ బాయిల్ అవుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని స‌ద‌రు చెఫ్ ఏమంటున్నారంటే.. ఒక కోడిగుడ్డును హార్డ్ బాయిల్ చేసేందుకు క‌నీసం 13 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంద‌ట‌. అదీ ఎక్కువ మంట పెడితే 9 నిమిషాల్లోనే గుడ్డు ఉడుకుతుంద‌ని అంటున్నారు. క‌నుక హార్డ్ బాయిల్ ఎగ్ తినాల‌నుకునే వారు క‌నీసం 13 నిమిషాల పాటు దాన్ని ఉడికిస్తే చాల‌ట‌. దీంతో కోడిగుడ్డు చ‌క్క‌గా ఉడుకుతుంది. బాయిల్డ్ ఎగ్స్ విష‌యంలో ఈ సూచ‌న‌లు పాటిస్తే గుడ్లు చ‌క్క‌గా ఉడ‌క‌డ‌మే కాదు.. రుచిగా కూడా ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM