Gongura : గోంగూర అంటే తెలుగువారికి చాలా ఇష్టం. పచ్చడి చేసినా ఊరగాయ పెట్టినా పప్పు చేసినా ఎంతో ఇష్టంగా తింటారు. ఒకరకంగా చెప్పాలంటే గోంగూర అంటే ప్రాణం పెట్టేస్తారు. తెలుగునాట గోంగూరకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆంధ్రమాతగా ఆరాధిస్తారు. ఇష్టంగా భుజిస్తారు. పచ్చడి వేసుకున్నా.. పులుసుగా తిన్నా గోంగూర రుచి మరి దేనికీ ఉండదంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే గోంగూరతో తెలుగువారి జీవనం ముడిపడి పోయింది. అందరికీ అందుబాటు ధరలో ఉండే పుల్లని రుచితో ఉండే గోంగూరలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. గోంగూరలో విటమిన్ సి, ఎ, బి6 తో పాటు ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. గోంగూరను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. సీజన్ మారుతున్న సమయంలో దగ్గు, రొంప వంటివి వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో గోంగూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.
గోంగూర సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉండటం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారు విటమిన్ K పుష్కలంగా ఉన్న గోంగూర తింటే రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు. రక్తహీనత సమస్య దూరం కావాలంటే విటమిన్ కె అవసరం. గోంగూరలో విటమిన్ A సమృద్ధిగా ఉండడం వలన తరచుగా గోంగూరను తీసుకుంటే కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోవటమే కాకుండా కంటి చూపు మెరుగవుతుంది. గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉండడం వలన యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేసి గుండె, కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు సహాయపడుతుంది.
మధుమేహం ఉన్నవారికి గోంగూర చాలా మంచిది. గోంగూర రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి షుగర్ లెవెల్స్ ని తగ్గించి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాక రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేసి గుండెకు సంబందించిన సమస్యలు లేకుండా చేస్తుంది. గోంగూరలో క్యాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉండడం వలన రోజువారీ ఆహారంలో గోంగూరను భాగంగా చేసుకుంటే ఎముకలు బలంగా, ఆరోగ్యంగా, పటిష్టంగా ఉంటాయి. ఇలా గోంగూరతో ఎన్నో ప్రయోజనాలను మనం పొందవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…