పూర్వకాలం నుంచి మన పెద్దలు కొన్ని ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు. అవన్నీ సైన్స్‌తో ఏదో ఒక రకంగా ముడిపడి ఉన్నవే. అయితే కొందరు మాత్రం వీటిని మూఢ విశ్వాసాలుగా కొట్టి పారేస్తుంటారు. ఇతరులకు లేదా మనకు ఎలాంటి హాని కలగనప్పుడు, డబ్బులతో ముడిపడి లేపప్పుడు ఎలాంటి విశ్వాసాలను అయినా సరే నమ్మవచ్చని పెద్దలు చెబుతున్నారు. ఇక అలాంటి వాటిల్లో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా సాయంత్రం 6 దాటిన తరువాత ఏమేం పనులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం.
సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. అవేమిటంటే.. సాయంత్రం 6 దాటితే సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లను ఎట్టి పరిస్థితిలోనూ ఇంటికి తెచ్చుకోరాదు. అవి శని స్థానాలుగా చెప్పబడుతున్నాయి. ఇక సాయంత్రం అయిన తరువాత పెరుగు, ఊరగాయలు, మిరప పొడి ఎవరికీ ఇవ్వరాదు. వీటిని లక్ష్మీస్థానాలని అంటారు. శనివారం చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసం కొని ఇంటికి తేరాదు.
ఇక ఇంటిని, ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అలా ఉంచితేనే లక్ష్మీదేవికి ఇష్టం. లేదంటే ఆమె వెళ్లిపోతుంది. అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో దరిద్ర దేవత ఉంటుంది. కనుక ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అలాగే పూజ గదిలో వెంట్రుకలు పడకుండా చూడాలి. లేదంటే దేవతలకు మనం పెట్టే నేవేద్యం చేరదని చెబుతారు. ఇక ఇంటిని కడిగే నీటిలో ఉప్పు వేసి కడగాలి. దీంతో ఇల్లు శుభ్రమవడమే కాదు.. దుష్టశక్తులు, దిష్టి అనేవి ఉండవు.
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…