Curry Leaves Butter Milk : మజ్జిగ, కరివేపాకులలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిని విడిగా కాకుండా కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఒక మిక్సీ జార్ లో గుప్పెడు కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి వేయాలి. ఆ తర్వాత ఒక కప్పు పెరుగు, మూడు నల్ల మిరియాలు వేయాలి. ఆ తర్వాత పావు స్పూన్ జీలకర్ర, అర అంగుళం అల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పు నీటిని పోసి మిక్సీ చేయాలి. మిక్సీ చేశాక ఒక గ్లాస్ లో పోసి తాగాలి. ఈ మజ్జిగ తాగటం వలన ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి రోజు తాగవచ్చు. అలా కుదరని వారు కనీసం వారంలో మూడు సార్లు తాగినా మంచి ఫలితం ఉంటుంది. అయితే దీన్ని తయారు చేశాక ఫ్రిజ్‌లో పెట్టుకుని కూడా తాగవచ్చు. దీంతో శరీరం చల్లబడుతుంది. ఇలా తాగడం వల్ల వేసవిలో ఎంతో మేలు జరుగుతుంది.
అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు కరివేపాకుతో తయారుచేసిన మజ్జిగ తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా డయాబెటిస్ ఉన్నవారు ఈ మజ్జిగను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. పొట్టకు సంబంధించిన సమస్యలు గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి వాటిని తగ్గించుకోవచ్చు. మజ్జిగలో కాల్షియం, విటమిన్ లు సమృద్దిగా ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. కరివేపాకులో ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్లు సి, ఎ, బి, ఇ సమృద్ధిగా ఉంటాయి. దీని వల్ల మనకు పోషణ లభిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండడం వలన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసి ఆరోగ్యం బాగుండేలా ప్రోత్సహిస్తుంది. కరివేపాకు శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉండడం వలన చర్మానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. మంచి కంటి చూపు కోసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందువల్ల కరివేపాకులతో తయారు చేసిన మజ్జిగను మనం రోజూ తాగాలి. దీంతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. పైగా వేసవిలో దీన్ని తాగితే వేడి తగ్గుతుంది. శరీరం చల్లబడుతుంది. దీన్ని మధ్యాహ్నం సమయంలో చల్ల చల్లగా తాగితే మేలు జరుగుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…