Ghee : నెయ్యి తింటే బ‌రువు పెరుగుతారా.. త‌గ్గుతారా.. అస‌లు ఇందులో నిజం ఏది..?

March 1, 2023 3:04 PM

Ghee : నెయ్యి తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతామ‌ని చాలా మంది అనుకుంటారు. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఎందుకంటే.. నెయ్యి నిజానికి బ‌రువును త‌గ్గిస్తుంది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. నెయ్యిని నిత్యం త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. అలాగే ప‌లు ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా మ‌న‌కు నెయ్యి వ‌ల్ల క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యిలో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఉన్న కొవ్వును క‌రిగించ‌డంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందువ‌ల్ల నెయ్యి తింటే బ‌రువు త‌గ్గుతారు త‌ప్ప పెర‌గ‌రు. అలాగే గుండె జ‌బ్బులు కూడా రాకుండా ఉంటాయి. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కూడా నెయ్యి తినాలి.

నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తిన‌డం అల‌వాటు చేసుకుంటే శ‌రీరంలో ఉన్న కొవ్వు క్ర‌మంగా క‌రుగుతుంది. అలాగే మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. ఆక‌లి బాగా పెరుగుతుంది. థైరాయిడ్ స‌మ‌స్యలు ఉన్న‌వారు ఇలా నెయ్యిని తింటే ఫ‌లితం ఉంటుంది. రోజంతా నిరుత్సాహంగా, నిస్స‌త్తువ‌తో ఉండేవారు ఉద‌యాన్నే అల్పాహారంతో నెయ్యి తినాలి. దీంతో మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది. ఉత్సాహంగా ఉంటారు. ఎల్ల‌ప్పుడూ శ‌క్తి ల‌భిస్తుంది. ఏ ప‌ని ఎంత సేపు చేసినా అల‌సిపోకుండా ఉంటారు. నెయ్యిని తిన‌డం వ‌ల్ల మ‌న శరీరానికి ఎల్ల‌ప్పుడూ శ‌క్తి ల‌భిస్తుంది.

ghee causes weight gain or loss what is the truth
Ghee

ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం నెయ్యి తింటే ఆ నొప్పుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. పిల్ల‌ల‌కు రోజూ నెయ్యి తినిపించ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. చ‌దువుల్లో వారు రాణిస్తారు. క‌నుక నెయ్యిని ప్ర‌తి ఒక్క‌రూ రోజూ తీసుకోవాల్సిందే. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now