ప్రస్తుత తరుణంలో చాలా మంది చిన్న వయస్సులోనే అనేక రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. పూర్వం మన పెద్దలకు 60 ఏళ్లు దాటితే కానీ అనారోగ్యాలు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు 20 ఏళ్లలోనే చాలా మందికి అనేక వ్యాధులు వస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ఇక ప్రస్తుతం చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి నొప్పులతో అవస్థలు పడుతున్నారు. అయితే ఇందుకు డాక్టర్లు ఇచ్చే మందులను వాడడంతోపాటు కింద చెప్పిన చిట్కాలను ఫాలో అవ్వాలి. దీంతో నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక బౌల్ లో ఒక స్పూన్ కలబంద జ్యూస్, కోడిగుడ్డు తెల్లసొన వేసి బాగా కలిపి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజుల పాటు చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. కలబందలో ఉన్న లక్షణాలు నొప్పులను తగ్గిస్తాయి.
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం, అరస్పూన్ తేనె కలిపి ఉదయం సమయంలో తాగాలి. ఇలా తాగటం వలన కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, అధిక బరువు సమస్య నుండి బయట పడతారు. కొబ్బరి నూనెలో కర్పూరం వేసి వేడి చేసి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాయాలి. ఇలా చేస్తున్నా కూడా నొప్పుల నుంచి బయట పడతారు. ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఇలా పలు చిట్కాలతో నొప్పులను తగ్గించుకోవచ్చు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…