Red Colour Clothes : తెలుగు వారాలలో ఆదివారం చాలా గొప్పది. సాక్షాత్తూ సూర్యభగవానుడికి సంబంధించిన రోజు. సంస్కృతంలో భానువారంగా పిలువబడుతుంది. ఇంకా చెప్పాలంటే భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆది వారాన్ని సూర్యదేవుని పేరుతో రవివార్ గా ఇప్పటికీ పిలుస్తున్నారు. కొన్ని దేశ సంస్కృతులలో ఇది వారాంతంలో రెండవ రోజు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఆదివారాన్ని సెలవుదినంగా పాటిస్తారు. వారంలో మొదటి రోజుగా పరిగణించే ఆదివారం నాడు పాటించాల్సిన కొన్ని నియమ నిబంధనలు ఇలా ఉన్నాయి.
ఆదివారం ఉదయాన్నే సూర్య స్త్రోత్రం పఠించడంతోపాటు స్నానమాచరించి సూర్య నమస్కారం చేయడం మంచిది. సూర్య స్తోత్రం తర్వాత ఆలయ దర్శనం చేసుకుని ఎరుపు రంగు పువ్వులను స్వామికి సమర్పించడం ఉత్తమమని పండితులు పేర్కొంటున్నారు. అయితే ఆదివారం రోజు స్త్రీలు తలలో మందారం వంటి ఎరుపు రంగు పువ్వులు ధరించడం సౌభాగ్య చిహ్నమని చెబుతున్నారు.
అదేవిధంగా ఆదివారం ఎరుపు రంగు దుస్తులను ధరించడం శ్రేష్టమని నిపుణులు అంటున్నారు. భానువారం రోజున సూర్యభగవానునికి గోధుమలు, నవధాన్యాలను నైవేద్యంగా సమర్పించినట్లైతే సకల సంపదలు దరి చేరుతాయి. గోధుమలతో తయారు చేసిన వంటకాలు.. చపాతీ, పూరీ తదితరాలను ఆదివారం రోజు భుజించినట్లైతే ఆరోగ్యదాయకమని చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతి ఆదివారం ఇలా చేస్తే ఆరోగ్యం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు. కనుక ఆదివారం రోజు ఇలా చేస్తే అన్ని విధాలుగా మేలు పొందవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…