Active Brain : మానవ శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన అవయవం. మన బాడీ వెయిట్ లో మెదడుది రెండు శాతమే అయినా దీని విధులు ప్రత్యేకం. ప్రతి వ్యక్తి యొక్క శక్తి సామర్ధ్యాలు, జ్ఞాపక శక్తి, ధారణా శక్తి అతని మేధాశక్తి మీదే ఆధారపడి ఉంటాయి. సో అలాంటి మైండ్ ను యాక్టివ్ గా ఉంచుకోవాలంటే ఈ 4 పనులు చేయాలి. అవేంటో ఓ సారి చూద్దాం. మనం ఏదైనా చదవాలనుకున్నప్పుడు దానిని శ్రద్ధతో పఠించడంవల్ల మెదడులో అబిజ్ఞా సామర్ధ్యాలు పెరిగి మెదడును ఉత్తేజపరుస్తాయి. అంతేకాక రక్త ప్రసరణ అనాసక్త భాగాలలో విరివిగా జరిగి జ్ఞాపకశక్తి మెరుగవుతుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞుల పరిశోధనలలో తేలింది. కానీ ఇది కేవలం పఠనం వల్లనే సాధ్యం, ఆటల ద్వారా, టీవీ వీక్షణం వల్ల కాదట. కనుక మెదడును యాక్టివ్‌గా ఉంచుకోవాలంటే రోజూ పుస్తకాలను చదవాలి.
డ్రాయింగ్ వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. ఇటీవల జరిగిన ఒక సర్వేలో 62 -70 సంవత్సరాల వయోవృద్ధులలో పెయింటింగ్, ఆర్ట్స్ విభాగాలలో విభజిస్తే పెయింటింగ్ వర్గం వారి మెదడు పనితీరు మెరుగ్గా ఉందని తేలింది. కనుక మెదడును యాక్టివ్‌గా ఉంచడం కోసం పెయింటింగ్ కూడా ఎంతగానో పనిచేస్తుంది. మనం తినే ఆహరంలో ఉండే ఫ్రక్టోజ్ మన జ్ఞాపకశక్తిని, సాధనా శక్తిని తగ్గిస్తుంది. దీనికి కారణం చక్కెరలు మెదడులోని నాడీవ్యవస్థను బలహీన పరుస్తాయి. దీంతో మెదడు స్తబ్దుగా మారుతుంది. కనుక మెదడు యాక్టివ్‌గా ఉండాలంటే చక్కెరలకు దూరంగా ఉండాలి.
మన మెదడులో 80 శాతం మేర నీరు ఉంటుంది. అందులో ఏమాత్రం తగ్గినా చాలు.. మెదడు పనితీరు తగ్గుతుంది. కనుక నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు గాను మనం రోజూ తగిన మోతాదులో నీళ్లను తాగాల్సి ఉంటుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాము. మెదడులో నీటి శాతం తగ్గదు. ఫలితంగా మెదడుకు నీరు సరిగ్గా సరఫరా అవుతుంది. ఇది మన మెదడును యాక్టివ్‌గా ఉంచుతుంది. కనుక మెదడు యాక్టివ్‌గా ఉండాలంటే రోజూ తగినన్ని నీళ్లను తాగాల్సి ఉంటుంది. లేదంటే మెదడు పనితీరు మందగిస్తుంది. ఇలా మెదడు యాక్టివ్‌గా ఉండాలంటే పలు సూచనలను పాటించాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…