ఆరోగ్యం

Fennel Seeds : సోంపు గింజ‌ల‌ను తేలిగ్గా తీసుకోవ‌ద్దు.. వీటితో క‌లిగే లాభాలు తెలిస్తే.. వెంట‌నే తింటారు..!

Fennel Seeds : భోజ‌నం చేసిన వెంట‌నే సోంపు తిన‌డం మ‌న ద‌గ్గ‌ర ఎప్ప‌టి నుంచో వ‌స్తోంది. కానీ ఈ జంక్‌ఫుడ్ యుగంలో ఆ పాత ప‌ద్ధ‌తిని మ‌రిచిపోయాం. దీంతోపాటు అలాంటి ఆహారం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా మ‌నం ఎదుర్కొంటున్నాం. కానీ భోజ‌నం చేసిన ప్ర‌తి సారీ కొన్ని సోంపు గింజ‌ల‌ను నోట్లో వేసుకుని బాగా న‌మిలి మింగితే దాంతో మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. ప్ర‌ధానంగా వాత‌, పిత్త దోషాల వ‌ల్ల క‌లిగే రోగాలు న‌య‌మ‌వుతాయి. ఈ క్రమంలో సోంపు వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌తో నేటి త‌రుణంలో చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్రమంలో అలాంటి స‌మ‌స్య‌లు ఉన్నవారు భోజ‌నం చేసిన వెంట‌నే 1 టీస్పూన్ సోంపు గింజ‌ల‌ను తింటే దాని వ‌ల్ల జీర్ణాశ‌య స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. వాత దోషాల‌ను హ‌రించే గుణం ఉన్నందున సోంపుతో అధిక బ‌రువు స‌మ‌స్య ఇట్టే తొల‌గిపోతుంది. ఎందుకంటే భోజ‌నం చేశాక సోంపు తిన‌డం వ‌ల్ల ఒంట్లో ఉన్న నీరంతా బ‌య‌టికి పోతుంది. త‌ద్వారా బ‌రువు త‌గ్గుతారు.

Fennel Seeds

భోజ‌నం చేసిన వెంట‌నే సోంపును తింటే దాంతో నోరు తాజాగా మారుతుంది. నోటిలో ఉండే బాక్టీరియా, ఇత‌ర క్రిములు న‌శించ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ క్ర‌మంలో దంతాలు, చిగుళ్లు శుభ్రంగా మారుతాయి. వాటిలో ఉన్న స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయి. రుతుస్రావం అయ్యే స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు నొప్పి ఉండ‌డం స‌హ‌జ‌మే. అయితే అలాంటి వారు భోజ‌నం చేసిన వెంట‌నే కొన్ని సోంపు గింజ‌ల‌ను తింటే దాంతో రుతుక్ర‌మ నొప్పి త‌గ్గుతుంది. ఇత‌ర రుతు సంబంధ స‌మ‌స్య‌లు కూడా త‌గ్గిపోతాయి.

సోంపులో మాంగ‌నీస్, జింక్‌, కాప‌ర్‌, ఐర‌న్‌, కాల్షియం, పొటాషియం, సెలీనియం, మెగ్నిష‌యం వంటి ఖ‌నిజ ల‌వణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. దీంతో ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. శ‌రీరంలో జ‌రిగే ఫ్రీ ర్యాడిక‌ల్స్ న‌ష్టాన్ని నివారించ‌వ‌చ్చు. ఐర‌న్‌, కాపర్ వంటి పోష‌కాలు ఉండ‌డం వ‌ల్ల సోంపు గింజ‌ల‌తో ర‌క్తం బాగా ప‌డుతుంది. ఇది ర‌క్త‌హీన‌త ఉన్న వారికి మేలు చేస్తుంది. ఎర్ర ర‌క్త క‌ణాల‌ను ఎక్కువ‌గా త‌యారు చేసేలా చూస్తుంది. గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఇది ఎంత‌గానో మేలు చేసే అంశం.

మ‌ధుమేహం ఉన్న వారు భోజ‌నం చేసిన వెంట‌నే సోంపును తింటే దాని వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. సోంపు గింజ‌లు ఇన్సులిన్ సెన్సిటీవిటీని పెంచుతాయి. కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. మెట‌బాలిజం ప్ర‌క్రియ‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తాయి. ఇది బ‌రువు త‌గ్గేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. పొటాషియం అధికంగా ఉండ‌డం వ‌ల్ల సోంపు గింజ‌లు బీపీని నియంత్రిస్తాయి. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి. ర‌క్త‌నాళాలు వెడ‌ల్పుగా మారేందుకు స‌హ‌క‌రిస్తాయి. దీంతో ర‌క్త‌నాళాల్లో కొవ్వు కూడా చేర‌కుండా ఉంటుంది.

సోంపు గింజ‌ల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గిపోతాయి. చ‌ర్మం మృదువుగా మారుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి క‌నుక సోంపు గింజ‌ల‌ను రోజూ తిన‌డం మ‌రిచిపోకండి. వీటితో ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM