ఆరోగ్యం

Dry Grapes : కిస్ మిస్‌ల‌ను రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే తింటే కలిగే 10 లాభాలివే..!

Dry Grapes : ద్రాక్ష పండ్ల‌ను ఎండ బెట్టి త‌యారు చేసే ఎండు ద్రాక్ష (కిస్ మిస్‌) అంటే చాలా మందికి ఇష్ట‌మే. వీటినే కిస్ మిస్ పండ్ల‌ని కూడా పిలుస్తారు. వీటిని ఎక్కువ‌గా స్వీట్లు, తీపి వంట‌కాల త‌యారీలో అంద‌రూ ఉప‌యోగిస్తారు. అయితే ఈ ఎండు ద్రాక్ష‌ల‌ను కొన్నింటిని తీసుకుని రాత్రిపూట నీటిలో నాన‌బెట్టి వాటిని ఉద‌యాన్నే తింటే దాంతో మ‌నకు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ప్ర‌ధానంగా ప‌లు ర‌కాల అనారోగ్యాల‌ను దూరం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండు ద్రాక్ష‌ల్లో ఐర‌న్ ఎక్కువగా ఉంటుంది. ఇది ర‌క్త‌హీన‌త‌ను నివారిస్తుంది. పైన చెప్పిన‌ట్టుగా నిత్యం కొన్ని ఎండు ద్రాక్ష‌ల‌ను తింటుంటే దాంతో ర‌క్తం బాగా త‌యార‌వుతుంది.

విట‌మిన్ బి, పొటాషియం వంటి పోష‌కాలు కిస్ మిస్ పండ్ల‌లో ఉంటాయి. ఇవి గుండె సంబంధ వ్యాధుల‌కు అడ్డుగోడ‌గా నిలుస్తాయి. ఉద‌యాన్నే ఎండు ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల రోజంతా ఉత్తేజంగా ఉంటుంది. రోజంత‌టికీ కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. ఉద్యోగుల‌కు, పిల్ల‌ల‌కు కిస్ మిస్ పండ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి. ర‌క్తంలో ఉన్న చెడు కొలెస్ట‌రాల్ త‌గ్గుతుంది. అధిక బ‌రువు ఉన్న వారు నిత్యం కొన్ని కిస్ మిస్ పండ్ల‌ను తింటే అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.

Dry Grapes

ఉదయాన్నే ఎండు ద్రాక్ష‌ల‌తోపాటు కొన్నివెల్లుల్లి రెబ్బ‌ల్ని ప‌చ్చిగా అలాగే తింటుంటే బీపీ అదుపులోకి వ‌స్తుంది. ఎండుద్రాక్ష‌లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్క‌లంగానే ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్ నుంచి శ‌రీరానికి ర‌క్ష‌ణ‌గా నిలుస్తాయి. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతాయి. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం తొల‌గిపోతుంది. గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి. ఎండుద్రాక్ష‌లో యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శ‌రీరాన్ని ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్షిస్తాయి. వైర‌ల్ జ్వ‌రాలు, ఇన్‌ఫెక్ష‌న్ల‌తో బాధ ప‌డే వారు కిస్ మిస్ పండ్ల‌ను తింటుంటే త్వ‌ర‌గా కోలుకుంటారు. ఇలా కిస్‌మిస్‌ల‌ను రోజూ తింటే మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM

28 రోజుల రీచార్జ్ ప్లాన్‌ పేరుతో దోపిడీ.. పార్లమెంట్‌లో రాఘవ్ చద్దా ఫైర్!

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…

Thursday, 12 March 2026, 7:33 PM

తాప్సీ ఫైర్.. స్టార్ల స్టాఫ్‌పై నిర్మాతల ఆరోపణల్లో నిజం లేదు!

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వ‌స్తార‌ని, దీంతో వారికి చేసే ఖ‌ర్చు గ‌ణ‌నీయంగా…

Thursday, 12 March 2026, 4:59 PM

ఐపీఎల్ 2026పై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ శుక్లా.. ఆ వార్తల్లో నిజం లేదు!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…

Thursday, 12 March 2026, 3:06 PM

ఆనంద్‌ దేవరకొండ షేర్ చేసిన క్రేజీ వీడియో.. విజయ్, రష్మిక డ్యాన్స్‌ అదుర్స్!

నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…

Thursday, 12 March 2026, 12:11 PM

‘ఆ 100 విజయాలు వేస్ట్’.. వరల్డ్ కప్ గెలిచాక గంభీర్ స్పీచ్‌! సూర్యకుమార్ షాకింగ్ రివీల్.

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…

Thursday, 12 March 2026, 10:50 AM