ఆరోగ్యం

Back Pain : ఈ సూచ‌న‌లు పాటిస్తే అస‌లు వెన్ను నొప్పి రానే రాదు..!

Back Pain : వెన్ను నొప్పి. నేటి త‌రుణంలో చాలా మందిని ఇది బాధిస్తోంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో ఆరోగ్యం గురించి చాలా మంది అంత‌గా శ్ర‌ద్ధ చూపించ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తోపాటు వెన్ను నొప్పి స‌హ‌జంగా అంద‌రికీ వ‌స్తోంది. అయితే ఒక్కొక్క‌రికి ఒక్కో కార‌ణం వ‌ల్ల ఈ నొప్పి వ‌స్తుంటుంది. అంద‌రికీ ఒకే కార‌ణం ఉండాల‌ని ఏమీ లేదు. అయితే అలాంటి ప‌లు కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వీటి వ‌ల్లే చాలా మందికి ప్ర‌స్తుతం వెన్ను నొప్పి వ‌స్తోంది. క‌నుక అవేంటో తెలుసుకుంటే అందుకు త‌గిన విధంగా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

నిత్యం ఎక్కువ బ‌రువున్న వ‌స్తువుల‌ను మోసే వారికి వెన్ను నొప్పి స‌హజంగానే వ‌స్తుంటుంది. బాగా వంగ‌డం, బ‌రువు ఎత్త‌డం వంటి ప‌నుల‌ను ప‌దే ప‌దే చేస్తే వెన్నెముక‌పై ఒత్తిడి ప‌డుతుంది. దీంతో ఆ భాగంలో నొప్పి వ‌స్తుంది. నేటి త‌రుణంలో చాలా మంది కూర్చుని ప‌నిచేసే ఉద్యోగాల‌నే చేస్తున్నారు. దీంతో అప్పుడ‌ప్పుడు కాదు క‌దా, క‌నీసం టాయిలెట్‌కు వెళ్లేందుకు తీరిక లేకుండా చాలా మంది అలాగే గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారు. ఇందువ‌ల్ల కూడా వెన్ను నొప్పి వ‌స్తుంది. చాలా మంది యోగా, ఎక్స‌ర్‌సైజ్‌లు చేసేటప్పుడు స‌రైన భంగిమ‌లో చేయ‌రు. అస‌హ‌జంగా చేస్తారు. దీని వ‌ల్ల కూడా వెన్నెముక‌పై భారం ప‌డి నొప్పి వ‌స్తుంటుంది.

Back Pain

కంప్యూట‌ర్ లేదా టీవీ ముందు కూర్చునే భంగిమ‌లో తేడా వ‌చ్చినా వెన్ను నొప్పి వ‌స్తుంది. మ‌రీ అంత మెత్త‌గా లేదా మ‌రీ అంత హార్డ్‌గా ఉన్న ప‌రుపుల‌ మీద నిద్రించ‌కూడ‌దు. దీని వ‌ల్ల వెన్నెముక‌పై ఒత్తిడి క‌లుగుతుంది. అది వెన్నునొప్పికి దారి తీస్తుంది. గుంత‌లు ప‌డిన ర‌హ‌దారుల్లో నిత్యం వెళ్లే వాహ‌న‌దారుల‌కు కూడా వెన్ను నొప్పి వ‌స్తుంది. అలాంటి రోడ్ల‌లో వెళ్తే క‌లిగే కుదుపుల‌కు వెన్నెముక‌పై భారం ప‌డుతుంది. ఫ‌లితంగా నొప్పి వ‌స్తుంది. క‌నుక ఈ సూచ‌న‌లు పాటిస్తే దాంతో వెన్ను నొప్పి వ‌చ్చే అవ‌కాశాలను త‌గ్గించుకోవ‌చ్చు. వెన్నెముక‌పై భారం ప‌డ‌కుండా ఉంటుంది..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM