Eye Sight : నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో కంటి చూపు కూడా ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మందికి ఈ సమస్య వస్తోంది. ఈ క్రమంలోనే రోజు రోజుకీ కంటి అద్దాలను పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం పోషకాహార లోపమే. దీని వల్లే ఆ సమస్య వస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎవరైనా నిత్యం సరైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం తప్పనిసరి అయింది. అయితే దీంతోపాటు కింద చెప్పిన ఓ చిట్కా పాటిస్తే దాంతో కూడా కంటి ఆరోగ్యాన్ని ఇంకా మెరుగు పరుచుకోవచ్చు. దీంతో కంటి సమస్యలు పోతాయి. చూపు బాగా వస్తుంది. మరి ఆ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
కావల్సిన పదార్థాలు..
బాదం పప్పు, సోంపు, కండ చక్కెర (పటిక బెల్లం).
తయారీ విధానం..
ఈ మూడింటినీ విడి విడిగా సమాన భాగాల్లో తీసుకోవాలి. సోంపు, బాదం పప్పులను విడి విడిగా దోరగా వేయించుకోవాలి. మూడింటినీ పొడిగా చేసి కలిపి ఓ గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన పొడిని పెద్దవారయితే రెండు టీ స్పూన్ల పొడిని, పిల్లలయితే ఒక టీ స్పూన్ పొడిని ఒక గ్లాస్ పాలలో కలుపుకుని తాగాలి. ఇలా రోజుకి రెండు సార్లు తీసుకోవాలి. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే మూడు నెలల్లోనే కంటి చూపు అనూహ్యంగా మెరుగవుతుంది. ఈ క్రమంలో ఒక ఆరు నెలల పాటు ఈ పొడి తాగితే కంటి చూపు బాగా పెరగడమే కాదు, నేత్ర సమస్యలు పోతాయి. కంటి అద్దాలు వాడాల్సిన పని ఉండదు.
ఇక పైన చెప్పిన పొడిని తాగడం వల్ల కేవలం కంటి సమస్యలు మాత్రమే కాదు, పలు ఇతర అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. దీంతో ఎముకలు, కండరాలు బలోపేతం అవుతాయి. శరీరంలో వేడి తగ్గిపోతుంది. ఈ పొడితోపాటు ఆకుపచ్చని కూరగాయలు, ఆకు కూరలు, నట్స్, క్యారెట్లు, క్యాబేజీ, బీట్ రూట్, నిమ్మ కాయలు, తృణ ధాన్యాలు, బ్రొకొలి, చేపలు, టమాట వంటి ఆహారాలను నిత్యం తీసుకుంటూ ఉంటే దాంతో కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…