Coconut Water : కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దాంట్లో మన శరీరానికి కావల్సిన ఎన్నో రకాల పోషక పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి. పొటాషియం, సోడియం, డైటరీ ఫైబర్, విటమిన్ సి, మెగ్నిషియం, కాల్షియం, సెలీనియం వంటి ఎన్నో విటమిన్లు, మినరల్స్ కొబ్బరి నీటిలో ఉంటాయి. వీటి వల్ల మనకు సంపూర్ణ పోషకాహారం అందడమే కాదు, పలు అనారోగ్యాలు కూడా దూరమవుతాయి. అయితే నిత్యం ఉదయాన్నే పరగడుపున 50 – 60 ఎంఎల్ మోతాదులో కొబ్బరి నీళ్లను తాగితే దాంతో మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుందట. ఆ ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లను ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది. దీంతో శరీరంలో ఉన్న ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. శరీరానికి కావల్సిన ముఖ్యమైన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉదయాన్నే అందుతాయి, కాబట్టి రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. నరాల సంబంధ సమస్యలు తొలగిపోతాయి. కండరాలకు పుష్టి కలుగుతుంది. గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. కొబ్బరినీళ్లలో సైటోకినిన్స్ అనబడే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి. చర్మం కాంతివంతంగా మారేలా చేస్తాయి.
జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ప్రధానంగా అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. దీంతో వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడే శక్తి మనకు లభిస్తుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది. బీపీ అదుపులోకి వస్తుంది. చర్మ సంబంధ సమస్యలు దూరమవుతాయి. కనుక రోజూ ఉదయాన్నే పరగడుపునే కొబ్బరి నీళ్లను తాగడం అలవాటు చేసుకోవాలి. దీంతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే షుగర్ ఉన్నవారు మాత్రం డాక్టర్ సూచన మేరకు కొబ్బరి నీళ్లను తాగడం మంచిది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…