Bharat Ane Nenu : సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. నటనలో తన తండ్రిని మరిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించిన మహేష్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ మూవీలు ప్రజాదరణ పొందుతూ హిట్ అవుతున్నాయి కూడా. ఇక అలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో భరత్ అనే నేను కూడా ఒకటి. ఇందులో మహేష్ సీఎంగా నటించి మెప్పించారు.
ఇక ఈ మూవీలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భరత్ అనే నేను అని మహేష్ మొదలు పెడతాడు. అయితే దాన్నే సినిమా టైటిల్‌గా పెట్టారు. ఈ డైలాగ్ సినిమా రిలీజ్‌కు ముందే ఎంతో ప్రాచుర్యం పొందింది. అప్పట్లో సినిమాకు హిట్ టాక్ వచ్చేందుకు ఈ డైలాగ్ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన మూవీ కావడంతో ఈ మూవీని ప్రేక్షకులు అలరించారు.
అయితే ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మహేశ్ చేసే ప్రతిజ్ఞ గుర్తుంది కదా. భరత్ అనే నేను.. అంటూ స్టార్ట్ అయ్యే ఆ ప్రమాణం అందరినీ ఆకట్టుకుంది. ఆ డైలాగ్ చెప్పడానికి మహేశ్ తీసుకున్న టైం ఎంతో తెలుసా. 2 గంటలు పైనే. ఎందుకు అంత టైం తీసుకున్నారు. ఆ డైలాగ్ డబ్బింగ్ చెప్పిన తర్వాత మహేశ్ ఎలా ఫీల్ అయ్యారు.. అంటే.. సాధారణంగా నేతలు ప్రమాణం చేసినప్పుడు తప్పులు దొర్లుతుంటాయి. ఇది సినిమా కనుక ఎలాంటి తప్పు లేకుండా ఒక బేస్ వాయిస్‌తో రావాలి. లేదంటే పేలవంగా ఉంటుంది. అందుకనే చాలా టైం తీసుకుని ఆ డైలాగ్‌ను చెప్పానని.. ఆ తరువాత ఎంతో గొప్పగా ఫీలయ్యానని మహేష్ అప్పట్లో అన్నారు. అయితే ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ప్రస్తుతం ఆశ్చర్యపోతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…