Curd : పెరుగు తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దీంతో మనకు కలిగే ఆరోగ్యకర ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. పెరుగును నిత్యం తినడం వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పెరుగులో ఉండే మంచి బాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. దీంట్లోని కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం కూడా పెరుగుకు ఉంటుంది. అందుకే చాలా మంది ఎండగా ఉన్నప్పుడు పెరుగును తింటారు. దీంతో శరీరం త్వరగా చల్లబడి ఉపశమనం కలుగుతుంది. అయితే పెరుగు పట్ల చాలా మందిలో తలెత్తే ప్రశ్న ఒకటుంది. అదేమిటంటే.. రాత్రి పూట పెరుగు తినవచ్చా..? లేదా..? తింటే ఏమవుతుంది..? అని చాలా మంది సందేహిస్తుంటారు. ఈ క్రమంలో అసలు రాత్రి పూట పెరుగును తినాలా, వద్దా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉందని ఇప్పటికే చెప్పాం కదా. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. అయితే పెరుగును రాత్రి పూట తినడం వల్ల మ్యూకస్ ఎక్కువగా తయారవుతుంది. దీంతో కఫం వస్తుంది. తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది మంచిది కాదు. కనుక వారు రాత్రి పూట పెరుగును తినకూడదు. అందుకు బదులుగా మజ్జిగ తీసుకోవచ్చు. అందులో కొంత నిమ్మరసం లేదా, మిరియాల పొడి కలుపుకుని రాత్రి పూట తాగవచ్చు. అయితే అలా దగ్గు, జలుబు సమస్య లేని వారు రాత్రి పూట నిర్భయంగా పెరుగు తినవచ్చు.
ఇక దగ్గు, జలుబు సమస్య ఉన్నవారు పెరుగును మధ్యాహ్నం పూట తినవచ్చు. దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే వారు కొద్దిగా చక్కెర లేదా మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకుని తినడం ఉత్తమం. దీంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు రావు. తెలుసుకున్నారుగా, రాత్రి పూట పెరుగును తినాలో వద్దో..! ఇంకెందుకాలస్యం, మీకు గనక దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు లేనట్టయితే నిరభ్యంతరంగా రాత్రి పూట పెరుగు తినవచ్చు..!
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…