Chamomile Tea : చామంతి పూల టీ యా..! అవునా..! అని ఆశ్చర్యపోకండి..! మీరు విన్నది నిజమే..! చామంతి పూల నుంచి తీసిన కొన్ని పదార్థాలతో తయారు చేసే పొడితో టీ పొడి తయారు చేస్తారు. అది అచ్చం సాధారణ టీ పొడిని పోలి ఉంటుంది. అంటే.. ఇది కూడా గ్రీన్ టీలాగే ఉంటుంది. అయితే రూపంలోనే కాదు, చామంతి పూల టీ అందించే ఔషధ గుణాలు కూడా గ్రీన్ టీలాగా అద్భుతంగా ఉంటాయి. ఈ క్రమంలో చామంతి పూల టీని నిత్యం తాగుతూ ఉంటే గ్రీన్ టీ వల్ల పొందే బెనిఫిట్స్‌ను పొందవచ్చు. రుచి కూడా వెరైటీగా ఉంటుంది. మరి చామంతి పూల టీ వల్ల మనకు కలిగే లాభాల గురించి తెలుసుకుందామా.
చామంతి పూలతో తయారు చేసే టీలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. బాగా తలనొప్పిగా ఉంటే వెంటనే చామంతి పూల టీ తాగేయండి. దీంతో ఆ తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి చామంతి పూల టీ ఎంతగానో దోహదం చేస్తుంది. నిత్యం చామంతి పూల టీ తాగుతుంటే దాంతో రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది.
డయాబెటిస్ ఉన్న వారికి కూడా చామంతి పూల టీ మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. తద్వారా డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. చామంతి పూల టీని నిత్యం తాగుతుంటే జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. గ్యాస్, అజీర్ణం, మలబద్దకం, అసిడిటీ వంటి సమస్యలు ఉండవు. మనస్సుకు రిలాక్సేషన్ ఇవ్వడంలో చామంతి పూల టీ ఉపయోగపడుతుంది. ఈ టీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…