Nadiya Daughters : పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అత్త పాత్ర పోషించిన నదియా.. అత్తగా అందరి మనసుల్లో స్థానం సంపాదించుకుంది. వాస్తవానికి ఆమె 1984లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. మళయాలంలో మోహన్ లాల్ సరసన నటించిన తొలి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. తమిళం, మళయాలంలలో చాలా సినిమాలు చేసిన తర్వాత నాలుగేళ్లకే శిరీష్ గౌడ్ బొలే అనే బ్యాంకర్ ను పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయింది. మళ్లీ తమిళ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మిర్చిలో ప్రభాస్ కి అమ్మగా, అత్తారింటికి దారేదిలో పవన్ కి అత్తగా ప్రేక్షకుల మనసులో చెరగని స్థానం సంపాదించుకుంది. అ.. ఆ.., దృశ్యం సినిమాల్లో కూడా తన నటనతో ఆకట్టుకుంది.
ఇక నదియాకి ఇద్దరు కూతుర్లున్నారు. ఒకరు సనమ్, మరొకరు జనా. ఇప్పుడు సోషల్ మీడియాలో నదియా కూతుర్లిద్దరి ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకూ అలనాటి హీరోయిన్లు తమ కూతుర్లని తారలుగా పరిచయం చేశారు. రేపో మాపో నదియా ఆ పని చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇప్పటివరకూ ఇలాంటి వార్తలైతే ఏవీ రాలేదు కానీ.. నదియా కుమార్తెల ఫొటోలు హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అమ్మలాగే వీరు కూడా సినిరంగంవైపు వస్తారో.. వస్తే అమ్ లా హిట్స్ అందుకుంటారో.. లేదో.. చూడాలి..
ఇక నదియా కూతుళ్ల ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా.. వాటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నదియాకు ఇంత అందమైన కుమార్తెలు ఉన్నారా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వారు సినిమాల్లోకి ఎప్పుడు వస్తున్నారు.. అంటూ అడుగుతున్నారు. మరి వారు తెరంగేట్రం ఎప్పుడు చేస్తారో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…