Nadiya Daughters : అత్తారింటికి దారేది ఫేమ్ నదియా కూతుర్లు హీరోయిన్ లకు ఏ మాత్రం తీసిపోరు.. అందంలో తల్లి పోలికే..!

March 4, 2023 5:32 PM

Nadiya Daughters : పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అత్త పాత్ర పోషించిన నదియా.. అత్తగా అందరి మనసుల్లో స్థానం సంపాదించుకుంది. వాస్తవానికి ఆమె 1984లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. మళయాలంలో మోహన్ లాల్ సరసన నటించిన తొలి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. తమిళం, మళయాలంల‌లో చాలా సినిమాలు చేసిన తర్వాత నాలుగేళ్లకే శిరీష్ గౌడ్ బొలే అనే బ్యాంకర్ ను పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయింది. మళ్లీ తమిళ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మిర్చిలో ప్రభాస్ కి అమ్మగా, అత్తారింటికి దారేదిలో పవన్ కి అత్తగా ప్రేక్షకుల మనసులో చెరగని స్థానం సంపాదించుకుంది. అ.. ఆ.., దృశ్యం సినిమాల్లో కూడా తన నటనతో ఆకట్టుకుంది.

ఇక నదియాకి ఇద్దరు కూతుర్లున్నారు. ఒకరు సనమ్, మరొకరు జనా. ఇప్పుడు సోషల్ మీడియాలో నదియా కూతుర్లిద్దరి ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకూ అలనాటి హీరోయిన్లు తమ కూతుర్లని తారలుగా పరిచయం చేశారు. రేపో మాపో నదియా ఆ పని చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇప్పటివరకూ ఇలాంటి వార్తలైతే ఏవీ రాలేదు కానీ.. నదియా కుమార్తెల ఫొటోలు హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అమ్మలాగే వీరు కూడా సినిరంగంవైపు వస్తారో.. వస్తే అమ్ లా హిట్స్ అందుకుంటారో.. లేదో.. చూడాలి..

have you ever seen Nadiya Daughters photos viral
Nadiya Daughters

ఇక న‌దియా కూతుళ్ల ఫొటోలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతుండ‌గా.. వాటిని చూసిన నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. న‌దియాకు ఇంత అంద‌మైన కుమార్తెలు ఉన్నారా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వారు సినిమాల్లోకి ఎప్పుడు వ‌స్తున్నారు.. అంటూ అడుగుతున్నారు. మ‌రి వారు తెరంగేట్రం ఎప్పుడు చేస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment