డయాబెటిస్‌ను అదుపులో ఉంచే ఉసిరి టీ..!

July 20, 2021 10:07 PM

డయాబెటిస్‌ ఉన్నవారు చక్కెర వేసిన టీని తాగకూడదు. అందుకని వారు షుగర్‌ ఫ్రీ వేసిన టీని తాగుతుంటారు. అయితే ఉసిరి టీని తాగడం వల్ల అటు టీ తాగిన కోరిక తీరుతుంది. దీంతోపాటు డయాబెటిస్‌ కూడా అదుపులో ఉంటుంది.

drink amla tea daily to control diabetes

ఉసిరికాయల్లో ఉండే విటమిన్‌ సి మధుమేహాన్ని తగ్గిస్తుంది. అందువల్ల డయాబెటిస్‌ ఉన్నవారు రోజూ ఉసిరి టీని తాగితే మంచిది. రెండు ఉసిరికాయలు, చిన్న అల్లం ముక్కలను తీసుకుని వాటిని గ్లాస్‌ నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిలో కొద్దిగా తేనె వేసి బాగా కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా తాగడం వల్ల డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది.

అయితే ఉసిరికాయలు అందుబాటులో లేకపోతే ఉసిరికాయ జ్యూస్‌ మనకు మార్కెట్‌లో లభిస్తుంది. దాన్ని కూడా వాడవచ్చు. లేదా ఉసిరిక పొడి లభిస్తుంది. దాంతో కూడా టీ తయారు చేసుకుని రోజూ తాగవచ్చు. ఇలా ఉసిరి టీని రోజూ ఉదయాన్నే అల్పాహారం అనంతరం తాగుతుంటే క్రమంగా షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్‌ అదుపులోకి వస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment