Meals : నేటి తరుణంలో మన జీవన విధానంలో మనం అనుసరిస్తున్న అలవాట్లు, చేస్తున్న పొరపాట్ల వల్ల మనకు అనేక రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిల్లో స్థూలకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ లు చాలా ముఖ్యమైనవి. ఇవే కాదు, మనం చేస్తున్న అనేక పనుల వల్ల కూడా మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అదీ ముఖ్యంగా భోజనం చేసిన తరువాత మనం పాటిస్తున్న కొన్ని అలవాట్లు మనకు చేటు చేస్తున్నాయి. వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం చేసిన తరువాత పండ్లను తినరాదు. తింటే అవి జీర్ణాశయానికి చేరి అటునుంచి పేగుల్లోకి వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కాదు. కనుక భోజనం చేసిన వెంటనే పండ్లను తినరాదు. కావాలంటే ఒక గంటన్నర సమయం దాటిన తరువాత తినవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. భోజనం ముగిసిన వెంటనే స్నానం చేయరాదు. అలా చేస్తే మన శరీరంలో రక్తం అన్ని భాగాలకు సరఫరా అవుతుంది. దీంతో జీర్ణాశయానికి రక్త సరఫరా తగ్గుతుంది. ఫలితంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. దీనికి తోడు గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి.
భోజనం చేసిన వెంటనే చేయకూడని మరొక పని టీ, కాఫీ తాగడం. అవి అప్పుడు తాగితే జీర్ణాశయం పనితీరు దెబ్బ తింటుంది. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించలేదు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రించరాదు. అలా చేస్తే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. గ్యాస్ వస్తుంది. స్థూలకాయం సమస్య వస్తుంది. ఈత కొట్టడం, వ్యాయమం చేయడం, పనులు చేయడం వంటి వాటిని భోజనం చేశాక చేయరాదు. కనీసం 30 నుంచి 60 నిమిషాల గ్యాప్ తరువాతే ఆ పనులు చేయాలి. లేదంటే జీర్ణాశయంలో గ్యాస్ పెద్ద ఎత్తున పేరుకుపోతుంది. అది ఇబ్బందిని కలిగిస్తుంది.
చాలా మంది భోజనం చేశాక బెల్ట్ టైట్ అయిందని చెప్పి దాన్ని లూజ్ చేస్తారు. దీంతో సౌకర్యంగా ఉంటుందని అనుకుంటారు. కానీ అలా చేయరాదు. ఎందుకంటే అప్పటి వరకు టైట్‌గా ఉన్న పేగులు లూజ్ అయ్యే సరికి చుట్టుకున్నట్టు అవుతాయి. వాటి కదలిక సరిగ్గా ఉండదు. భోజనం చేసిన వెంటనే పొగ తాగరాదు. ఎందుకంటే మిగిలిన సమయాల్లోకన్నా భోజనం చేశాక ఒక సిగరెట్ తాగితే అది 10 సిగరెట్లకు సమానమట. కనుక ఆ పని చేయరాదు. ఇలా భోజనం అనంతరం పాటించే కొన్ని అలవాట్లను మానేయాల్సి ఉంటుంది. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…