Lakshmi Devi : కొందరు ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోతుంది. మరికొందరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ముఖ్యంగా గ్రహాల అనుగ్రహం లేకపోతే ఎంత కష్టపడినా అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కొందరికి ఎప్పుడూ దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి వారు ఈ చిన్న పని చేస్తే చాలు.. ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం చేసే పూజలు, దానాలు, హోమాలు వంటి వాటి వలన మనకు ఉన్న దోషాలు కొంతవరకు పోయి మనం కష్టాల నుంచి కొంతవరకు బయటకు వస్తాం అనేది నమ్ముతాం. పూజ చేసేటప్పుడు భక్తి శ్రద్దలతో ఎలా చేస్తామో.. దానం చేసేటప్పుడు కూడా సరైన దానం, సరైన వారికి చెయ్యాలి. లేదంటే దాన ఫలితం లేకుండా పోతుంది. గొప్పల కోసం చేసే సహాయాలు, మనకు నచ్చిన వారికి ఇచ్చే బహుమతులు లాంటివి దానాలు కావు. దానం అనేది లేని వారికి, బ్రాహ్మణులకు చెయ్యాలి. అలాగే దానాలు చేసేటప్పుడు కొన్ని మంచి రోజులు చూసుకుని, ఆ రోజు కొన్నింటిని దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది.
లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం. ఈ రోజున బ్రాహ్మణులకు నువ్వులు, బెల్లం దానం ఇస్తే కోటి రెట్లు పుణ్యం వస్తుంది. అన్ని గ్రహ దోషాలు తొలగి లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది. ఒకవేళ బ్రాహ్మణుడికి దానం ఇవ్వలేకపోతే ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు నువ్వులు, బెల్లం ఉంచి లక్ష్మీదేవిని పూజించి మనసులో ఉన్న కోరికని కోరుకుని ఆ నువ్వులు, బెల్లంను ఆవుకి పెట్టాలి. ఇలా చేయడం వలన అన్ని దోషాలు తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. ధనం బాగా సంపాదిస్తారు. కనుక లక్ష్మీ దేవి అనుగ్రహం లభించాలంటే శుక్రవారం రోజు ఇలా చేయాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…