శరీర బరువును తగ్గించుకునేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. అయితే అన్ని వ్యాయామాల్లోనూ వాకింగ్ చాలా సులభమైంది. కానీ సైకిల్ తొక్కడం కూడా చాలా సులభమే. దీంతో వాకింగ్ కన్నా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. పైగా క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. దీంతో బరువు వేగంగా తగ్గవచ్చు. మరి రోజూ గంట సేపు సైకిల్ తొక్కితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. సైకిల్ తొక్కడం వల్ల గంటకు ఏకంగా 400 నుంచి 600 క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. వేగంగా సైకిల్ తొక్కితే ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. దీంతో కొవ్వు వేగంగా కరుగుతుంది. అధిక బరువు త్వరగా తగ్గుతారు.
2. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు రోజూ గంట సేపు సైకిల్ తొక్కితే షుగర్ లెవల్స్ ను గణనీయంగా తగ్గించుకోవచ్చు.
3. సైకిల్ తొక్కడం వల్ల కండరాలకు చక్కని వ్యాయామం అవుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి. శక్తి లభిస్తుంది.
4. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన సమస్యలతో సతమతం అయ్యేవారు సైకిల్ తొక్కడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
5. గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. నడుం కింది భాగంలో ఉండే కొవ్వు కరుగుతుంది. చక్కని దేహాకృతి లభిస్తుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా. మరి సైకిల్ తొక్కడం ప్రారంభించేయండి ఇక..!
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…