కొందరు సెల్ఫీల మోజుతో ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు కొన ప్రాణాలతో బయట పడగా మరికొందరు మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఈ విధంగా సెల్ఫీ పై ఉన్న మోజు ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. డేర్‌డెవిల్ ఇన్‌ఫ్లూయెన్సర్ సోఫియా చుంగ్ (32) సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ కింద పడి మరణించారు.
సోఫియా కొండలు, గుట్టలు ఎక్కుతూ ప్రమాదకర విన్యాసాలు చేస్తూ వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎంతో పాపులారిటీనీ దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కు మంచి వీకెండ్ ఉండాలని భావించింది. ఈ సందర్భంగా తన స్నేహితులతో కలిసి హాంకాంగ్‌లోని హాపాక్‌లై అనే పార్క్‌కు వెళ్లిన ఆమె అక్కడి అందాలను చూస్తూ ఎంతో మైమరచిపోయింది.
ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి జలపాతం అంచున సెల్ఫీ దిగడానికి ప్రయత్నించగా పట్టుతప్పి కింద పడిపోయింది. సుమారు 16 అడుగుల ఎత్తు ఉన్న ఈ జలపాతం నుంచి సోఫియా కింద పడటంతో మృతి చెందింది. ఈ క్రమంలోనే ఆమె అభిమానులందరికీ మంచి వీకెండ్ ఉండాలని ఆశిస్తూ పెట్టిన ఆఖరి పోస్ట్ వైరల్‌గా మారింది. ‘అందరికీ మంచి జరగాలని ఆశించిన నువ్వు ఇప్పుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయావా.. అంటూ పలువురు నివాళులర్పించారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…