Curd In Winter : చలికాలంలో సహజంగానే చాలా మంది శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాలను తింటుంటారు. ఈ క్రమంలోనే శరీరానికి చలువ చేసే ఆహారాలను ఈ సీజన్‌లో పక్కన పెడతారు. వాటిని తింటే జలుబు చేస్తుందని భావిస్తారు. అయితే చలువ చేసే ఆహారాలను చలికాలం తింటే జలుబు చేసే మాట వాస్తవమే అయినా వాటిల్లో కొన్ని ఆహారాలను మాత్రం చలికాలం అయినా సరే తినాల్సిందే. ఎందుకంటే ఇలాంటి ఆహారాలు కొన్ని మనకు చలికాలంలోనూ పలు ప్రయోజనాలను అందిస్తాయి. వాటిల్లో చెప్పుకోదగినది పెరుగు. అవును ఇదే. ఈ సీజన్‌లో పెరుగును చాలా మంది తినరు. కనీసం మజ్జిగ కూడా తాగరు. చలువ చేసి జలుబు చేస్తుందని ఈ సీజన్‌లో పెరుగును పక్కన పెడుతుంటారు. కానీ వాస్తవానికి పెరుగును చలికాలంలో తినాల్సిందే. దీంతో పలు ప్రయోజనాలను మనం పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో పెరుగు తింటే ఎలా.. జలుబు చేస్తుంది కదా.. అంటే.. మనం దీన్ని మధ్యాహ్నం సమయంలో తినవచ్చు. రాత్రిపూట తినకపోయినా చలికాలంలో కనీసం మధ్యాహ్నం అయినా సరే పెరుగు తినాల్సిందే. దీంతో జలుబు చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పైగా పెరుగును తింటే చలికాలంలో పలు లాభాలను కూడా పొందవచ్చు. ఇక అవేమిటో ఇప్పుడు చూద్దాం. చలికాలంలో మన రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ సీజన్‌లో మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు పెరుగు ఎంతగానో దోహదపడుతుంది. దీన్ని తినడం వల్ల జీర్ణాశయంలో ప్రోబయోటిక్స్ పెరుగుతాయి. ఇవి జీర్ణవ్యవస్థలో ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మన శరీర రోగ నిరోధక వ్యవస్థకు చెందిన దాదాపు 70 శాతం కణాలు జీర్ణవ్యవస్థలోనే ఉంటాయి. కనుక పెరుగును తింటే ఈ కణాలను పెంచుకోవచ్చు. దీంతో రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.
ఇక ఈ సీజన్‌లో మనకు సూర్యరశ్మి కూడా సరిగ్గా లభించదు. ఫలితంగా విటమిడి సరిగ్గా తయారుకాదు. దీంతో ఎముకలు బలహీనంగా మారే అవకాశాలు ఉంటాయి. కానీ పెరుగును తింటే విటమిన్ డి లభిస్తుంది. ఇది ఎముకలను బలంగా ఉంచుతుంది. పైగా పెరుగులో కాల్షియం కూడా పుష్కలంగానే ఉంటుంది. ఇది కూడా ఎముకలు బలంగా మారేందుకు సహాయపడుతుంది. ఇలా పెరుగుతో ఎముకలను బలంగా ఉంచుకోవచ్చు. కనుక ఈ సీజన్‌లో పెరుగును తప్పక తినాలి.
చలికాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. మలబద్దకం సమస్య వస్తుంది. కానీ పెరుగును ఆహారంలో భాగం చేసుకుంటే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం ఉండదు. అలాగే పెరుగులో మన శరీరానికి అవసరం అయ్యే అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ప్రధానంగా పెరుగులో విటమిన్ బి12 ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాలు తయారు అయ్యేందుకు, నాడీ మండల వ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు అవసరం అవుతుంది. కనుక పెరుగును తింటే ఇవన్నీ పొందవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. రోగాలు రాకుండా ఉంటాయి.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…