Curd In Winter : చ‌లికాలంలో జ‌లుబు చేస్తుంద‌ని పెరుగును ప‌క్క‌న పెడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకుంటే పెరుగును విడిచిపెట్ట‌రు..!

December 25, 2023 9:44 PM

Curd In Winter : చ‌లికాలంలో స‌హ‌జంగానే చాలా మంది శ‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచే ఆహారాల‌ను తింటుంటారు. ఈ క్ర‌మంలోనే శ‌రీరానికి చ‌లువ చేసే ఆహారాల‌ను ఈ సీజ‌న్‌లో ప‌క్క‌న పెడ‌తారు. వాటిని తింటే జ‌లుబు చేస్తుంద‌ని భావిస్తారు. అయితే చ‌లువ చేసే ఆహారాల‌ను చ‌లికాలం తింటే జ‌లుబు చేసే మాట వాస్త‌వ‌మే అయినా వాటిల్లో కొన్ని ఆహారాల‌ను మాత్రం చ‌లికాలం అయినా స‌రే తినాల్సిందే. ఎందుకంటే ఇలాంటి ఆహారాలు కొన్ని మ‌న‌కు చ‌లికాలంలోనూ ప‌లు ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వాటిల్లో చెప్పుకోదగిన‌ది పెరుగు. అవును ఇదే. ఈ సీజ‌న్‌లో పెరుగును చాలా మంది తిన‌రు. క‌నీసం మ‌జ్జిగ కూడా తాగ‌రు. చ‌లువ చేసి జ‌లుబు చేస్తుందని ఈ సీజ‌న్‌లో పెరుగును పక్క‌న పెడుతుంటారు. కానీ వాస్త‌వానికి పెరుగును చ‌లికాలంలో తినాల్సిందే. దీంతో ప‌లు ప్ర‌యోజనాల‌ను మ‌నం పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చ‌లికాలంలో పెరుగు తింటే ఎలా.. జ‌లుబు చేస్తుంది క‌దా.. అంటే.. మ‌నం దీన్ని మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో తిన‌వ‌చ్చు. రాత్రిపూట తిన‌క‌పోయినా చ‌లికాలంలో క‌నీసం మ‌ధ్యాహ్నం అయినా స‌రే పెరుగు తినాల్సిందే. దీంతో జ‌లుబు చేసే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. పైగా పెరుగును తింటే చ‌లికాలంలో ప‌లు లాభాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఇక అవేమిటో ఇప్పుడు చూద్దాం. చ‌లికాలంలో మ‌న రోగ‌నిరోధ‌క శ‌క్తిపై ప్ర‌భావం చూపిస్తుంది. సీజ‌న‌ల్ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక ఈ సీజ‌న్‌లో మ‌నం రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాలి. అందుకు పెరుగు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. దీన్ని తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో ప్రోబ‌యోటిక్స్ పెరుగుతాయి. ఇవి జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. మ‌న శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌కు చెందిన దాదాపు 70 శాతం క‌ణాలు జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లోనే ఉంటాయి. క‌నుక పెరుగును తింటే ఈ క‌ణాలను పెంచుకోవ‌చ్చు. దీంతో రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. ఫ‌లితంగా రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీని వల్ల సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.

Curd In Winter must take this for many benefits
Curd In Winter

ఇక ఈ సీజ‌న్‌లో మ‌నకు సూర్య‌ర‌శ్మి కూడా స‌రిగ్గా ల‌భించ‌దు. ఫ‌లితంగా విట‌మిడి స‌రిగ్గా త‌యారుకాదు. దీంతో ఎముక‌లు బ‌ల‌హీనంగా మారే అవ‌కాశాలు ఉంటాయి. కానీ పెరుగును తింటే విట‌మిన్ డి ల‌భిస్తుంది. ఇది ఎముక‌ల‌ను బ‌లంగా ఉంచుతుంది. పైగా పెరుగులో కాల్షియం కూడా పుష్క‌లంగానే ఉంటుంది. ఇది కూడా ఎముక‌లు బ‌లంగా మారేందుకు స‌హాయ‌ప‌డుతుంది. ఇలా పెరుగుతో ఎముక‌ల‌ను బ‌లంగా ఉంచుకోవ‌చ్చు. క‌నుక ఈ సీజ‌న్‌లో పెరుగును త‌ప్ప‌క తినాలి.

చ‌లికాలంలో జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మంద‌గిస్తుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య వ‌స్తుంది. కానీ పెరుగును ఆహారంలో భాగం చేసుకుంటే ఈ స‌మ‌స్య‌లన్నింటికీ చెక్ పెట్ట‌వ‌చ్చు. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. అలాగే పెరుగులో మ‌న శ‌రీరానికి అవస‌రం అయ్యే అనేక ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. ప్ర‌ధానంగా పెరుగులో విట‌మిన్ బి12 ఉంటుంది. ఇది ఎర్ర ర‌క్త‌క‌ణాలు త‌యారు అయ్యేందుకు, నాడీ మండ‌ల వ్య‌వస్థ మెరుగ్గా ప‌నిచేసేందుకు అవ‌సరం అవుతుంది. క‌నుక పెరుగును తింటే ఇవ‌న్నీ పొంద‌వ‌చ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. రోగాలు రాకుండా ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now