Couples : సంతానం కలగడం లేదా..? అయితే తప్పనిసరిగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి..!

July 27, 2023 5:05 PM

Couples : ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకాలం కలిసి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అనుకున్నంత మాత్రాన అన్నీ అయిపోవు. ఒక్కోసారి అనుకున్నవి జరగకపోవచ్చు. కొన్ని కొన్ని సార్లు నిరాశ కూడా కలుగుతూ ఉంటుంది. కొంత మంది పెళ్లి తర్వాత పిల్లల కోసం ఎంతో ఆరాట పడుతూ ఉంటారు. కానీ కలగానే మిగిలిపోతూ ఉంటుంది. సంతానం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు.

సంతానలేమి సమస్య ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. చాలామంది దంపతులు ఈ బాధలు పడుతున్నారు. ఒకవేళ సంతానం కలగకపోతే వైద్య పరీక్షలు చేయించుకుని సంతానం ఎందుకు కలగడం లేదు అనేది తెలుసుకొని, సంతానం కలగడం కోసం వైద్యుని సలహా తీసుకుంటే కచ్చితంగా పిల్లలు పుడతారు. ఒకవేళ కనుక ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వకపోతే ఐయూఐ చేస్తారు.

Couples must know these facts if they are not having children
Couples

డాక్టర్లు మొదట పిల్లలు లేని వాళ్లకి ఐవీఎఫ్ పద్ధతిని చేయడానికి ముందు ఐయూఐ పద్ధతిని అనుసరిస్తారు. ఇది కనుక అవ్వకపోతే అప్పుడు ఐవీఎఫ్ ని ఫాలో అవుతారు. ఐయూఐ పద్ధతిలో స్పెర్మ్ ని కలెక్ట్ చేసి డైరెక్ట్ గా యుటెరస్ లోకి పంపుతారు. ఇది చాలా సహజమైన ప్రొసీజర్ ఏ. స్పెర్మ్ ని పంపగానే అది ఫాలోపియన్ ట్యూబ్స్ దగ్గరకి వెళుతుంది. కొన్ని రకాల మెడికేషన్ ద్వారా ఎగ్ ని ఫార్మ్ చేసాయడానికి, ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాల‌ని కల్పిస్తారు.

ఎక్కువ మోతాదులో గర్భనిరోధక మాత్రలు తీసుకుంటే చాలా ప్రమాదం. మాములుగా తీసుకుంటే ఒకటి లేదా రెండు నెలల్లో సంతానోత్పత్తి సాధారణ స్థితికి వస్తుంది. అదే ఒకవేళ అధికంగా ఈ మాత్రలు తీసుకుంటే సంతానోత్పత్తి సాధారణ స్థితికి రావడానికి మూడు నుండి 6 నెలలు సమయం పడుతుంది. ఐవీఎఫ్ పద్దతి పూర్తి కావడానికి, పూర్తి చేసుకోవడానికి కొన్ని నెలల‌ సమయం పడుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment