Cloves For Weight Loss : ల‌వంగాలను తింటే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

August 21, 2023 5:59 PM

Cloves For Weight Loss : చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా అధిక బరువుతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయాల్సిందే. అధిక బరువు ఉన్నట్లయితే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక బరువు సమస్య నుండి బయటపడడానికి చాలామంది వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. అదే విధంగా డైట్ లో కూడా ఎన్నో మార్పులు చేస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గడానికి లవంగాలు బాగా పనిచేస్తాయి.

లవంగాలతో ఈజీగా మనం బరువు తగ్గ‌వ‌చ్చు. లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో అధికంగా ఉంటాయి. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా లవంగాలు కాపాడుతాయి. బరువు తగ్గడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. లవంగాల టీ ద్వారా, మనం ఈజీగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎముకలని సరి చేసే మాంగనీస్ కూడా ఉంటుంది.

Cloves For Weight Loss take daily for better effect
Cloves For Weight Loss

 

విటమిన్ కె, పొటాషియం, బీటా కెరోటిన్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ తక్కువగా ఉంటాయి. లవంగాలు చాలా చక్కగా బరువు తగ్గడానికి పనిచేసినట్లు అధ్యయనంలో తేలింది. లవంగాలను తీసుకుంటే బరువు ఈజీగా తగ్గవ‌చ్చు. లవంగాలు జీవక్రియల‌ను పెంచుతాయి. దీంతో నేరుగా బరువు తగ్గవ‌చ్చు. షుగర్ తో బాధపడే వాళ్ళు కూడా లవంగాలని తీసుకోవడం మంచిది.

అప్పుడు బరువుని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. లవంగాల టీ తీసుకుంటే మీరు ఈజీగా బరువు తగ్గొచ్చు. అయితే మరీ ఎక్కువ లవంగాలని తీసుకుంటే పేగు ఆరోగ్యం దెబ్బతింటుంది. లవంగాలలోని రసాయనాలు పేగులని ప్రభావితం చేయగలవు. ఎక్కువ లవంగాలు తీసుకుంటే కండరాల నొప్పి, అలసట వంటివి కలగవచ్చు. కాబట్టి లిమిట్ గానే తీసుకోండి. లిమిట్ గా తీసుకుంటే ఈ ప్రయోజనాలని పొందొచ్చు. బరువు తగ్గడం మొదలు అనేక లాభాలను పొంది మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment