Cardamom For Belly Fat : యాల‌కుల‌ను ఇలా చేసి తీసుకోండి.. పొట్ట మొత్తం క‌రిగిపోతుంది..!

October 22, 2023 2:12 PM

Cardamom For Belly Fat : ఆరోగ్యానికి యాలకులు బాగా ఉపయోగపడతాయి. యాలకులను తీసుకోవడం వలన, చాలా సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఏమైనా మసాలా సామాన్లు వేసి, వంట చేసుకోవాలంటే, ఖచ్చితంగా అందులో యాల‌కులు ని కూడా వాడుతూ ఉంటాము. ఆయుర్వేదంలో కూడా యాల‌కులు కి మంచి ప్రాధాన్యత ఉంది. వివిధ రకాల సమస్యల్ని, దూరం చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. వీటి వలన కలిగే లాభాలు గురించి, వీటితో ఎటువంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు అనే విషయాలని, ఈరోజు తెలుసుకుందాం.

రోజూ, యాల‌కులు ని తీసుకోవడం వలన, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాలకులలో విటమిన్లు, విటమిన్ సి, ఇనుము, క్యాల్షియం, ఖనిజాలు వంటి పలు పోషకాలు ఉంటాయి. కాబట్టి, యాలకులను తీసుకుంటే, అనేక లాభాలు పొందడానికి అవుతుంది. నిజానికి, వీటిని సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇందులో ఉండే పోషకాలు, ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వలన, పోషకాల లోపం నుండి కూడా బయటపడొచ్చు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే, కార్బోహైడ్రేట్స్ తో పాటుగా క్యాల్షియం, పొటాషియం, ప్రోటీన్ కూడా ఇవి కలిగి ఉంటాయి.

Cardamom For Belly Fat take them in this way
Cardamom For Belly Fat

రోజూ ఆహారంలో మీరు యాల‌కులు ని చేర్చుకుంటే, చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. స్లిమ్ గా ఉండాలని అనుకునే వాళ్ళు, యాల‌కులు కచ్చితంగా రెగ్యులర్ గా తీసుకోండి. ఒంట్లో కొవ్వు పెరిగే కొద్దీ కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. ప్రతిరోజు, రాత్రి నిద్ర పోయే ముందు, వేడి నీటిలో రెండు యాల‌కులు పొడి కింద చేసుకుని,కలుపుకొని తాగితే కొవ్వు బాగా కరుగుతుంది. యాలకులను తీసుకోవడం వలన ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు.

బ్యాక్టీరియాతో పోరాడే శక్తి యాల‌కులు లో ఉంటుంది. యాలుకలను తీసుకుంటే, ఈ బాధలు కూడా ఉండవు. జీర్ణక్రియకి కూడా యాల‌కులు బాగా ఉపయోగపడతాయి. యాల‌కులు లో ఉండే, నెలటోనిన్ శరీరంలో ఉండే కొవ్వుని త్వరగా కాల్చేస్తుంది. యాలకులని తీసుకోవడం వలన శరీరంలో నిలువ ఉండిన అదనపు నీళ్లు, బయటకి వచ్చేస్తాయి. రోజు యాల‌కులు ని డైట్లో చేర్చుకుంటే రక్తపోటు కూడా కంట్రోల్ లో ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. టైప్ టు డయాబెటిస్ సమస్య కూడా ఉండదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now