Black Chickpeas : శనగలు.. వీటి గురించి చాలా మందికి తెలుసు. వీటిల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి నల్ల శనగలు. వీటిని మనం తరచూ ఉపయోగిస్తుంటాం. వీటిని పులిహోర వంటి వాటిలో వేస్తుంటారు. లేదా గుగ్గిళ్లను తయారు చేస్తారు. అలాగే కాబూలీ శనగలు అని ఇంకో రకం కూడా ఉంటాయి. వీటితో కూరలు చేస్తుంటారు. అయితే ఏ శనగలను తీసుకున్నా సరే మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. రోజూ ఒక కప్పు మోతాదులో వీటిని నానబెట్టి లేదా ఉడకబెట్టి తినాలి. దీంతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. శనగలను రోజూ తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
శనగలలో అనేక పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్ బి6, సి, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం తదితర పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మనకు పోషణను అందిస్తాయి. అనారోగ్యాలను నయం చేస్తాయి. దీంతోపాటు పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం ఉండదు. కాస్త వీటిని తినగానే కడుపు నిండిపోతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది.
శనగల్లో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల మాంసాహారం తినలేని వారు శనగలను తింటే ప్రోటీన్లను బాగా పొందవచ్చు. ప్రోటీన్లు కండరాల మరమ్మత్తులకు, ఎదుగుదలకు దోహదపడతాయి. కనుక శనగలను తింటే శాకాహారులకు ఎంతగానో మేలు జరుగుతుంది. శనగల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ కూడా తక్కువే. అందువల్ల వీటిని తిన్న వెంటనే షుగర్ లెవల్స్ పెరగవు. ఇది షుగర్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇక శనగలను రోజూ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
శనగలు తక్కువ జీఐ విలువను కలిగి ఉంటాయి కనుక షుగర్ ఉన్నవారు వీటిని నిర్భయంగా తినవచ్చు. ఇవి షుగర్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. శనగల్లో ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్ రాదు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శనగలను తినడం వల్ల కాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. దీని వల్ల వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఇక నల్ల శనగలు అయితే ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కనుక వీటిని తింటే రక్తం బాగా పడుతుంది. దీంతో రక్తహీనత సమస్య తగ్గుతుంది.
శనగలను రోజూ నేరుగా తినవచ్చు. నానబెట్టి లేదా ఉడకబెట్టి తినవచ్చు. కూరల్లోనూ తినవచ్చు. మొలకెత్తించి కూడా తినవచ్చు. వీటితో సలాడ్స్, సూప్ వంటివి కూడా చేసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే రోజూ శనగలను తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…