ఆరోగ్యం

Jeera Water : జీల‌క‌ర్ర నీళ్ల‌ను ఇలా తాగండి చాలు.. కొవ్వు వేగంగా కరిగి బ‌రువు త‌గ్గుతారు.. షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది..!

Jeera Water : ప్ర‌తి వంట‌లోనూ ఉప‌యోగించే దినుసుల్లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి. జీల‌క‌ర్ర‌ను వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మ‌న ఆరోగ్యానికి కూడా జీల‌క‌ర్ర ఎంతో మేలు చేస్తుంది. జీలక‌ర్ర‌లో థైమాల్ అనే రసాయ‌న స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది ఆహారం జీర్ణ‌మ‌వ్వ‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే జీర్ణ‌ర‌సాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డతాయి. అలాగే జీల‌క‌ర్ర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో అధికంగా కొలెస్ట్రాల్ చాలా సుల‌భంగా క‌రిగిపోతుంది. జీల‌క‌ర్ర‌లో ఉండే థైమో క్వినోన్ అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నం కాలేయాన్ని ఉత్తేజ‌ప‌రిచి శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటును పెంచుతుంది. దీంతో కొవ్వు క‌ణాల్లో ఉండే కొవ్వు చాలా సుల‌భంగా క‌రిగిపోతుంది.

కొవ్వు క‌ణాల్లో కొవ్వు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండ‌డం వ‌ల్ల ఇన్ ప్లామేష‌న్ రావ‌డంతో పాటు క్ర‌మంగా ఇన్సులిన్ నిరోధ‌క‌త వ‌చ్చి షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. క‌నుక శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్న వారు జీల‌క‌ర్ర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిల‌ను చాలా సుల‌భంగా అదుపులో ఉంచుకోవ‌చ్చు. జీల‌కర్ర‌ను రెండు గ్రాముల మోతాదులో 8 వారాల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ అలాగే ట్రై గ్లిజ‌రాయిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయ‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా తెలియ‌జేసారు. జీల‌క‌ర్ర‌ను లేదా జీల‌క‌ర్ర నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య‌నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అలాగే ఈ నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఇన్సులిన్ నిరోధ‌క‌త త‌గ్గుతుంది. అలాగే జీల‌క‌ర్ర‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఇన్ ప్లామేష‌న్ ను త‌గ్గించ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

Jeera Water

అయితే జీలక‌ర్ర‌ను మ‌నం ఎక్కువ‌గా వంటల్లో వాడుతూ ఉంటాము. నూనెలో వేసి వేయించ‌డం వ‌ల్ల జీల‌కర్రలో ఉండే ర‌సాయ‌నాలు, యాంటీ ఆక్సిడెంట్లు న‌శిస్తాయి. క‌నుక సాధ్య‌మైనంత వ‌ర‌కు జీల‌క‌ర్ర నీటిని తీసుకోవ‌డానికే ప్ర‌య‌త్నించాలి. జీల‌క‌ర్ర‌ను నీటిలో వేసి 3 నుండి 4 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఈ నీటిని మ‌రిగించి వ‌డ‌క‌ట్టాలి. ఈ నీటిని మ‌నం త‌క్కువ ఉష్ణోగ్ర‌త వ‌ద్ద మ‌రిగిస్తాము క‌నుక జీల‌క‌ర్ర‌లో ఉండే పోష‌కాలు న‌శించ‌కుండా ఉంటాయి. ఇలా త‌యారు చేసుకున్న జీల‌క‌ర్ర నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఈ జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది.

సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. షుగ‌ర్ వ్యాది అదుపులో ఉంటుంది. శ‌రీరం డీ హైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటుంది. శ‌రీరంలో ఉండే మ‌లినాలు, విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి. ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. ఈ విధంగా జీల‌క‌ర్ర నీరు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని అంద‌రూ త‌ప్ప‌కుండా ఈ జీల‌క‌ర్ర నీటిని తీసుకోవాల‌ని ముఖ్యంగా ఊబకాయంతో బాధ‌ప‌డేవారు ఈ నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM