Beetroot Juice : అనారోగ్యకరమైన జీవనశైలి, అధిక ఒత్తిడి వల్ల వచ్చే ప్రధాన వ్యాధులలో అధిక రక్తపోటు ఒకటి. దీనిని నిర్లక్ష్యం చేస్తే.. గుండె సమస్యలు, ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తపోటు ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ రక్తపోటును నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా చెప్పవచ్చు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు బీట్ రూట్ జ్యూస్ తాగితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. బీట్‌రూట్ సహజమైన నైట్రేట్‌లను కలిగి ఉంటుంది.
ఇది శరీరంలోకి వెళ్లి నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతుంది. దాని సహాయంతో రక్తాన్ని సరఫరా చేసే నాళాలు రిలాక్స్ అయ్యి రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. బీట్ రూట్ లో ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్ సి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. బీట్‌రూట్‌లో ఉన్న నైట్రేట్‌లు రక్త నాళాలను తెరుచుకునేలా చేస్తాయి. ఇది రక్త ప్రవాహానికి సహాయపడి అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. బీట్‌రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తాయి, అలాగే బి విటమిన్లు నరాల పనితీరును మెరుగుపరుస్తాయి.
ఇది బలమైన హృదయ స్పందనను నిర్వహించడానికి సహాయపడుతుంది. అంతేకాక ఇనుము, యాంటీఆక్సిడెంట్ల కలయిక రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. దాంతో ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది. బీట్ రూట్ జ్యూస్ ఏ సమయంలో తాగితే మంచిది అనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి.
బీట్ రూట్ జ్యూస్ ని రోజులో ఏ సమయంలోనైనా తాగవచ్చు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం ఖాళీ కడుపుతో లేదా బ్రేక్ ఫాస్ట్ కి గంట ముందు బీట్ జ్యూస్ తాగడం వల్ల పూర్తి ప్రయోజనం పొందవచ్చు. ఉదయం సమయంలో తాగటం వలన రోజంతా అలసట, నీరసం లేకుండా హుషారుగా ఉంటారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…