Beer : బీర్ ని ఎలా తీసుకుంటే మంచిది..? ఇలా తీసుకుంటే లాభం అని మీకు తెలుసా..?

December 16, 2023 9:20 PM

Beer : చాలామంది, బీర్ తాగుతూ ఉంటారు. బీర్ తాగడం వలన, నష్టాలు ఉంటాయన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. బీర్ తాగడం వలన, ఆరోగ్యానికి మంచిది కాదని చాలామంది అనుకుంటారు. అయితే, బీర్ తాగడం వలన ఆరోగ్యానికి పెద్ద హాని ఉంది. కానీ, ప్రయోజనం కూడా ఉంది. ఇలా, బీర్ తాగితే, ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నిజానికి ఆల్కహాల్ వంటివి తీసుకోవడం వలన, లివర్ ఆరోగ్యం దెబ్బతింటుంది. 650 మిల్లీలీటర్ల బీర్ లో నాలుగు నుండి పది శాతం మధ్య ఆల్కహాల్ ఉంటుంది.

ఆల్కహాల్ పర్సంటేజ్ పెరిగే కొద్దీ, మత్తు పెరగడం లేదంటే లివర్ హ్యాండిల్ చేసే విధానంలో ఇబ్బందులు రావడం, వంటివి ఆధారపడుతూ ఉంటాయి. 300 ఎంఎల్ వరకు మాత్రం తాగితే లివర్ ఏ రోజుకి ఆ రోజు, దాన్ని ఫ్రీగా హ్యాండిల్ చేసి, నష్టం కలగకుండా క్లియర్ చేస్తుంది. కేవలం ఇంతవరకు మాత్రమే, లివర్ క్లియర్ చేయగలదు. 300 ఎంఎల్ వరకు మాత్రమేనని గుర్తు పెట్టుకోండి. బీర్ తాగడం మొదలుపెట్టిన తర్వాత, 300 వరకు మాత్రమే తాగి ఎవరూ వదిలిపెట్టరు.

Beer is it healthy or what know the benefits
Beer

ఎక్కువ తాగేస్తూ ఉంటారు. అలా ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. సో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 650 ml బీర్లు తాగితే 200 కిలో క్యాలరీల ఎనర్జీ వస్తుంది. 100 ml బీర్ తీసుకుంటే, నాలుగు నుండి ఎనిమిది గ్రాముల పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ అందుతాయి. ఒకవేళ కనుక డోస్ కి మించి బీర్ తాగితే, అసలు మన బాడీ హ్యాండిల్ చేయలేదు.

లివర్ మీద, బాడీ సెల్స్ మీద ప్రభావం పడుతుంది. ఎక్కువగా బీర్ తాగడం వలన, హార్మోన్స్ నైట్ రిలీజ్ అవ్వాల్సినవి కొన్ని, డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఇలా బీర్ ఎక్కువ తాగడం వలన, లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కనుక బీర్ వలన ఉపయోగాలని పొందాలంటే, ఇక్కడ చెప్పినట్టు తీసుకోండి. మోతాదుకు మించి తీసుకోవద్దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now