Uric Acid Levels : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే, మనం చేసే పొరపాట్ల వలన, మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి, ఆరోగ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పులు చేయకుండా చూసుకోవాలి. ఒకానొక సందర్భంలో, యూరిక్ యాసిడ్ పెద్ద సమస్య కింద మారే అవకాశం ఉంది. బాగా ఎక్కువగా సీ ఫుడ్, మాంసం అలానే ఇతర ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు, యూరిక్ ఆసిడ్ లెవెల్స్ ఒంట్లో పెరిగిపోయే అవకాశం ఉంది.
బాగా అధికంగా యూరిక్ యాసిడ్ ఒంట్లో పెరిగిపోవడం వలన, రక్తంలో కలిసిపోతుంది. కిడ్నీలలోకి కూడా ప్రవేశిస్తుంది. దాంతో, కిడ్నీ స్టోన్స్ వంటివి కూడా కలుగుతాయి. యూరిక్ యాసిడ్ ఒంట్లో పెరిగిపోతే, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక యూరిక్ ఆసిడ్ లెవెల్స్ తో బాధపడుతున్న వాళ్ళు, ఇలా ఈజీగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు. యూరిక్ యాసిడ్ తగ్గించుకోవాలంటే, ప్యూరిన్స్ ని తగ్గించుకోవాలి.
కొన్ని రకాల చేపల్లో, సి ఫుడ్ అలానే మాంసం వంటి వాటిలో ఇది ఎక్కువ ఉంటుంది. ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా చూసుకోవాలి. అలానే, పంచదారని బాగా తగ్గించాలి. షుగర్ ఎక్కువ తీసుకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయినట్లయితే, పంచదారని బాగా తగ్గించుకోవాలి. పంచదార లేకుండా డ్రింక్స్ ని తీసుకోవడం మంచిది. ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ డిహైడ్రేషన్ కి గురిచేస్తుంది.
అలానే, ఆల్కహాల్ ని తీసుకోవడం వలన యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని కొన్ని సార్లు ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ప్రమాదంగా, మారే అవకాశం ఉంటుంది. బాగా యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వలన అది షుగర్ ఉన్న వాళ్ళపై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి, షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవడం కూడా అవసరం. అలానే, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. బీన్స్, బ్రోకలీ, బెర్రీస్, అవకాడో ఇలా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ విధంగా మీరు పాటించినట్లయితే, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోకుండా చూసుకోవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం జూనియర్ ఎన్‌టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…